25లోగా స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేయాలి

ABN , First Publish Date - 2020-12-11T04:50:07+05:30 IST

నూతన స్వయం సహాయ క సంఘాల ఏర్పాటు ఈ నెల 25లోగా పూర్తి చేయాలని కలెక్ట ర్‌ శరత్‌ అధికారులను ఆదేశించారు.

25లోగా స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేయాలి
సమావేశంలో అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ శరత్‌

కామారెడ్డి టౌన్‌, డిసెంబరు 10: నూతన స్వయం సహాయ క సంఘాల ఏర్పాటు ఈ నెల 25లోగా పూర్తి చేయాలని కలెక్ట ర్‌ శరత్‌ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్‌ క్యాం ప్‌ కార్యాలయంలో గ్రామీణాభివృద్ధి, స్త్రీనిధి, మెప్మా అధికారు లతో ఆయన స్వయం సహాయక సంఘాల ఏర్పాటును సమీక్షి ంచారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ డీపీఎంలు, ఏపీఎంలు క్షేత్రస్థాయిలో అర్హులైన వారిని గుర్తించి దాదాపు 18వేల మంది ని స్వయం సహాయక సంఘాలుగా ఈనెల 25లోగా ఏర్పాటు చేయాలని, స్వయం సహాయక సంఘాల ఏర్పాటుతో పాటు ఆన్‌లైన్‌ నమోదు, రిజిస్ట్రేషన్‌, బ్యాంక్‌ అకౌంట్‌ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. స్వయం సహాయక సంఘాలకు జనర ల్‌ బ్యాంకు లింకేజీ కింద 1,2752 సంఘాలకు గాను 10,615 సంఘాలకు రూ. 432కోట్ల రుణాల లక్ష్యానికి గాను రూ.338 కోట్ల రుణం అందించడం జరిగిందని మిగతా లక్ష్యాన్ని ఈ నెల 25లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. స్త్రీనిధి రుణాల కింద రూ.78 కోట్ల క్రెడిట్‌ టార్గెట్‌కు గాను రూ.38 కోట్ల రుణాలు అందించడం జరిగిందని, ఈ నెల 31 వరకు 80 శాతం పూర్తి చేయాలని స్త్రీనిధి రీజినల్‌ మేనేజర్‌ను ఆదేశించారు. స్త్రీనిధి కింద వీధి వ్యాపారులను గ్రౌండింగ్‌ చేపట్టాలని, ప్రత్యేక పథకా ల కింద డెయిరీ రుణాలు, 1500గాను 800 గ్రౌడింగ్‌ అయ్యా యని, మిగతా లక్ష్యాన్ని గుర్తించి రుణాలు అందించాలని, ఎలక్ట్రి కల్‌ ఆటో రుణాలకు, పౌలి్ట్ర కోళ్ల పెంపకం కింద గ్రౌండింగ్‌ చేప ట్టి రుణాలు మంజూరు చేయాలని తెలిపారు. మెప్మా ద్వారా వీధి వ్యాపారులకు 7,703గాను 6,945 శాంక్షన్‌ చేశామన్నారు. 5,920 సంబంధించి బ్యాంక్‌లో జమ చేయడం జరిగిందని, మిగిలిన వాటికి రుణాలు బ్యాంక్‌లో జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలని మెప్మా పీడీని ఆదేశించారు. మెప్మా సంఘాల జనరల్‌ లింకేజీ కింద 398 సంఘాలకు సంబంధించి రూ.27 కోట్లకు గాను రూ.26కోట్ల 4 లక్షల మంజూరు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌డీఏ పీడీ చంద్రమోహన్‌రెడ్డి, జిల్లా లీడ్‌ మేనేజర్‌ రాజేందర్‌రెడ్డి, ఉమ్మడి జిల్లా స్ర్తీనిధి రీజినల్‌ మేనేజరు అనంతకిషోర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-11T04:50:07+05:30 IST