మైనారిటీ గురుకులంలో ముగ్గురు ఉద్యోగుల సస్పెన్షన్‌

ABN , First Publish Date - 2020-12-11T05:17:36+05:30 IST

మండలంలోని ఆలూర్‌ గ్రా మ మైనారిటీ గురుకులంలో ఔట్‌ సోర్సింగ్‌ పద్ధతిలో పనిచేస్తున్న ముగ్గురు ఉద్యోగులను సస్పెండ్‌ చేస్తూ తెలంగాణ మైనారిటీ గురుకుల సొసైటీ కార్యదర్శి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు

మైనారిటీ గురుకులంలో  ముగ్గురు ఉద్యోగుల సస్పెన్షన్‌

ఆర్మూర్‌, డిసెంబరు 10: మండలంలోని ఆలూర్‌ గ్రామ మైనారిటీ గురుకులంలో ఔట్‌ సోర్సింగ్‌ పద్ధతిలో పనిచేస్తున్న ముగ్గురు ఉద్యోగులను సస్పెండ్‌ చేస్తూ తెలంగాణ మైనారిటీ గురుకుల సొసైటీ కార్యదర్శి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. అదే పాఠశాలలో పనిచేస్తున్న ఒక ఉద్యోగిని తనపట్ల ప్రిన్సిపాల్‌ రవీందర్‌, డేటా ఎంట్రీ ఆపరేటర్‌ సతీష్‌, సెక్యూరిటీ గార్డు కార్తీక్‌ అనుచితంగా ప్రవర్తించారని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయగా, విచారణ జరిపి ముగ్గురినీ సస్పెండ్‌ చేసి, హైదర్‌కు ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌ బాధ్యతలు అప్పగించారు. 


Updated Date - 2020-12-11T05:17:36+05:30 IST