వైభవంగా లక్ష్మీనర్సింహస్వామి కొండ ప్రదక్షిణ
ABN , First Publish Date - 2020-11-28T04:52:17+05:30 IST
భీమ్‌గల్ శ్రీలక్ష్మీనర్సింహస్వామి గుట్టపై శుక్రవారం ఉద యం ఉత్తర ద్వాదశి, అల్పద్వాదశితో పాటు తులసీ కల్యాణం నిర్వహించారు.

వేలాదిగా హాజరైన భక్తులు
గోవింద నామస్మరణతో మార్మోగిన గుట్ట
భీమ్‌గల్, నవంబరు 27: భీమ్‌గల్ శ్రీలక్ష్మీనర్సింహస్వామి గుట్టపై శుక్రవారం ఉద యం ఉత్తర ద్వాదశి, అల్పద్వాదశితో పాటు తులసీ కల్యాణం నిర్వహించారు. అనంతరం స్వామివారి చక్రస్వాముల ను ప్రత్యేకంగా అలంకరించిన పల్లకిలో గర్భగుడి నుంచి క ల్యాణ మండపం వరకు తీసుకువచ్చారు. అనంతరం వేద బ్రాహ్మణుల మంత్రోచ్ఛారణల మధ్య మంగళహారుతులు, గోవింద నామస్మణతో స్వామివారి పల్లకిని అడవిమార్గం గుండా గుట్ట చుట్టూ స్వామివారి కొండ ప్రదక్షిణ నిర్వహిం చారు. ఈ సందర్భంగా లింబాద్రిగుట్టపై హోమం, బలిప్ర దానం నిర్వహించారు. భక్తులు ప్రత్యేక దర్శనాలు చేసుకొని, పూజలు చేశారు. అన్నదానం కార్యక్రమంలో పాల్గొన్నారు.