పెద్దల సభకు సురేష్‌రెడ్డి!

ABN , First Publish Date - 2020-03-13T11:56:47+05:30 IST

రాజ్యసభ సభ్యుడిగా సురేష్‌రెడ్డిని ఎంపిక చే శారు. ఈ మేరకు సీఎం కేసీఆర్‌ నిర్ణయం తీసుకు న్నారు. రాజకీయ రంగంలో దీర్ఘకాలం ఎమ్మెల్యేగా, స్పీ కర్‌గా పనిచేసిన సురేష్‌రెడ్డికి అవకాశం కల్పించారు

పెద్దల సభకు సురేష్‌రెడ్డి!

టీఆర్‌ఎస్‌ నుంచి రాజ్యసభ సభ్యుడిగా కేఆర్‌ సురేష్‌రెడ్డి 

ఎంపిక చేసిన సీఎం కేసీఆర్‌ 

2018 సెప్టెంబరులో టీఆర్‌ఎస్‌లో చేరిన సురేష్‌రెడ్డి

హామీ మేరకు సముచిత స్థానం కల్పించిన సీఎం కేసీఆర్‌

హర్షం వ్యక్తం చేసిన అనుచరులు

నేడు నామినేషన్‌ దాఖలు  


నిజామాబాద్‌, మార్చి 12 (ఆంధ్రజ్యోతి ప్రతి నిధి): రాజ్యసభ సభ్యుడిగా సురేష్‌రెడ్డిని ఎంపిక చే శారు. ఈ మేరకు సీఎం కేసీఆర్‌ నిర్ణయం తీసుకు న్నారు. రాజకీయ రంగంలో దీర్ఘకాలం ఎమ్మెల్యేగా, స్పీ కర్‌గా పనిచేసిన సురేష్‌రెడ్డికి అవకాశం కల్పించారు. రాష్ట్రం తరపున రెండు రాజ్యసభ సీట్ల కోసం ఎన్నిక లు జరుగుతుండగా అధికార పార్టీ తరపున కేశవరా వుతో పాటు జిల్లా నుంచి మాజీ స్పీకర్‌ సురేష్‌రెడ్డికి అవకాశం కల్పించారు. అసెంబ్లీ ఎన్నికల ముందే  టీ ఆర్‌ఎస్‌లో చేరిన సురేష్‌రెడ్డికి మొదటి నుంచి కీలక పదవి వస్తుందని భావించారు. రాష్ట్రంలో రెండు సీట్లు ఖాళీ కావడంతో ఆయనకు అవకాశం కల్పించారు. స్పీ కర్‌, ఎమ్మెల్యేగా పబ్లిక్‌ ఎకౌంట్స్‌ కమిటీ ఛైర్మన్‌గా 20 ఏళ్ల పాటు పనిచేసిన సురేష్‌రెడ్డి అసెంబ్లీ ఎన్నికలకు  ముందు సెప్టెంబరు 2018లో టీఆర్‌ఎస్‌లో చేరారు.


పార్టీ అభ్యర్థుల గెలుపునకు కృషిచేశారు. సుమారు రెండేళ్ల పాటు ఎలాంటి పదవి లేకుండా టీఆర్‌ఎస్‌లో  కొనసాగారు. చివరకు రాజ్యసభ రూపంలో ఆయనకు సీఎం కేసీఆర్‌ అవకాశం ఇచ్చారు. పార్టీలో తగిన గు ర్తింపు ఇచ్చారు. నేడు శాసనసభలో ఆయన కేశవరా వుతో కలిసి రాజ్యసభ సభ్యత్వానికి నామినేషన్‌ టీ ఆర్‌ఎస్‌ పార్టీ తరపున దాఖలు చేయనున్నారు. ఆయ నకు రాజ్యసభ సభ్యత్వం ఖరారు కావడంతో జిల్లాలో ని బాల్కొండ, ఆర్మూర్‌ నియోజకవర్గాల నుంచి ఆయ న అనుచరులు భారీగా హైదరాబాద్‌కు తరలివెళ్తు న్నారు. తనకు అవకాశం కల్పించిన  సీఎం కేసీఆర్‌కు సురేష్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. తన మీద ఉంచిన బాధ్యతలను చిత్తశుద్ధితో నెరవేరుస్తానని ఆయన తెలిపారు.


చౌట్‌పల్లి నుంచి ఢిల్లీ వరకు

కమ్మర్‌పల్లి మండలం చౌట్‌పల్లికి చెందిన సురేష్‌రెడ్డి మే 25, 1959లో జన్మించారు. రాజకీయ కుటుం బంలో పుట్టిన ఆయన హైదరాబాద్‌లో చదువుకు న్నారు. నిజాం కాలేజీ నుంచి బీఏ పట్టా పుచ్చుకు న్నారు. రాజకీయ కుటుంబంలో పుట్టిన సురేష్‌రెడ్డి తా త కేతిరెడ్డి హన్మంత్‌రెడ్డి నిజామాబాద్‌ జిల్లా తొలి జ డ్పీ ఛైర్మన్‌గా పనిచేశారు. సురేష్‌రెడ్డి తండ్రి గోవింద్‌ రెడ్డి భీమ్‌గల్‌ సమితి ప్రెసిడెంట్‌గా పనిచేశారు. రాజ కీయాలకు వచ్చిన కేఆర్‌.సురేష్‌రెడ్డి 1989లో కాంగ్రెస్‌ పార్టీ తరపున బాల్కొండ నుంచి ఎమ్మెల్యేగా ఎంపిక య్యారు. అదే  నియోజకవర్గం నుంచి 4 పర్యాయాలు  ఎమ్మెల్యేగా  గెలుపొందారు. 2009 వరకు ఆయన ఎ మ్మెల్యేగా పనిచేశారు.  వైఎస్‌ హయాంలో 2004లో నాలుగోసారి గెలిచిన ఆయనను రాష్ట్ర స్పీకర్‌గా నియ మించారు.


ఆయన ఐదేళ్ల పాటు విజయవంతంగా స్పీకర్‌ పదవిని నిర్వహించారు. నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎంపికైన ఆయన ఒక దఫా సీఎల్‌పీ డిప్యూటీ లీడర్‌గా పని చేశారు. మరోదఫా పబ్లిక్‌ ఎకౌంట్స్‌ కమిటీ ఛైర్మన్‌గా  పని చేశారు. డీలిమి టేషన్‌లో భాగంగా ఆయన బాల్కొండ నుంచి ఆర్మూర్‌ ని యోజకవర్గానికి మారడం, 2009, 2014లో పోటీచేసి గెలుపొంద లేదు. 2018లో మాత్రం ఆయన పోటీకి దూరంగా  ఉన్నారు.  అసెంబ్లీ ఎన్ని కల ముందే టీఆర్‌ఎస్‌లో చేరారు. బాల్కొండ నుంచి ఎమ్మెల్యేగా పనిచేసిన సురేష్‌ రెడ్డికి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉండడం, శాసనసభ స్పీకర్‌గా పనిచేయడంతో రాజ్యసభలో కీలకం గా వ్యవహరించే అవకాశం ఉంటుందని సీఎం ఈ ని ర్ణయం తీసుకున్నట్లు పార్టీ నేతలు తెలిపారు.  వివా దాలకు మొదటి  నుంచి దూరంగా ఉండే సురేష్‌రెడ్డి కి రాజ్యసభ సభ్యుడిగా అవకాశం కల్పించడం పట్ల జిల్లా నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.   


నిజామాబాద్‌కు సముచిత స్థానం..

టీఆర్‌ఎస్‌ పార్టీ పెట్టిన ప్పటి నుంచి జిల్లా ప్రజలు వెంట ఉండడంతో తెలం గాణ ఏర్పడి రాష్ట్రం వచ్చిన తర్వాత జిల్లాకు సముచిత స్థానాన్ని సీఎం  కేసీఆర్‌ క ల్పిస్తున్నారు.  మంత్రి పద వులతో పాటు ఇతర పదవు ల్లో జిల్లా నేతలకు అవకాశం కల్పిస్తున్నారు. నాలుగేళ్ల క్రి తం జిల్లా నుంచి టీఆర్‌ఎస్‌ తరపున డీఎస్‌కు రాజ్యసభకు అవకాశం ఇచ్చారు. గత అసెం బ్లీ ఎన్నికలు పూర్తికాగానే మం త్రిగా ప్రశాంత్‌రెడ్డిన నియమిం చారు. ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డిని పబ్లిక్‌ అండర్‌టేకింగ్‌  ఛైర్మ న్‌గా నియమించారు. అంకాపూ ర్‌కు చెందిన మార గంగారెడ్డికి మార్క్‌ఫెడ్‌ ఛైర్మన్‌గా అవకాశం కల్పిం చారు. ప్రస్తుతం మాజీ స్పీకర్‌ సురేష్‌రెడ్డికి రాజ్యస భ సభ్యుడిగా అవకాశం ఇచ్చారు. 


బయోడేటా

పేరు : కేతిరెడ్డి సురేష్‌రెడ్డి

తండ్రి పేరు: కేతిరెడ్డి గోవింద్‌రెడ్డి

తల్లి : కేతిరెడ్డి విమలా దేవి

పుట్టిన తేదీ: 25-05-1959

విద్యార్హతలు : బీఏ (నిజాం కళాశాల)

భార్య: పద్మజారెడ్డి 

కుమారుడు: అనిత్‌రెడ్డి 

కూతురు: శ్రేయారెడ్డి

పదవులు:  1989, 1994, 1999, 2004 సంవత్సరాల్లో ఎమ్మెల్యేగా ఎంపిక, 2004 నుంచి 2009 వరకు స్పీకర్‌గా పనిచేశారు.

Updated Date - 2020-03-13T11:56:47+05:30 IST