టీఆర్‌ఎస్ శ్రేణులు రైతులకు మద్దతుగా భారత్‌బంద్‌లో పాల్గొనాలి
ABN , First Publish Date - 2020-12-07T06:16:57+05:30 IST
రైతులు ఈ నెల 8న తలపెట్టిన భారత్‌బంద్‌కు టీఆర్‌ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని ఉమ్మడి జి ల్లా టీఆర్‌ఎస్ శ్రేణులు రైతు న్యాయపోరాటానికి మద్దతుగా భారత్‌బంద్‌లో పాల్గొనాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభ వ్య వహారాల మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

సుభాష్‌నగర్, డిసెంబరు 6: రైతులు ఈ నెల 8న తలపెట్టిన భారత్‌బంద్‌కు టీఆర్‌ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని ఉమ్మడి జి ల్లా టీఆర్‌ఎస్ శ్రేణులు రైతు న్యాయపోరాటానికి మద్దతుగా భారత్‌బంద్‌లో పాల్గొనాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభ వ్య వహారాల మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కేంద్రం తెచ్చిన వ్య వసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న న్యాయమైన పోరాటాన్ని సమర్ధిస్తూ పార్టీ అధినేత కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. రైతుల ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా ఉన్నందునే పార్లమెంట్‌లో బీజేపీ ప్రభుత్వం తెచ్చిన వ్యవసాయ బిల్లును టీఆర్‌ఎస్ ప్రభుత్వం వ్యతిరేకిస్తుందని గుర్తుచేశారు. కేంద్ర ప్రభుత్వం కొత్త వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకునే వరకు పోరాటం కొనసాగించాల్సిన అవసరం ఉందని మంత్రి అన్నారు. పార్టీ అధినేత రైతు పక్షపాతి కేసీఆర్ పిలుపు మేరకే ఉమ్మడి నిజామాబాద్ జిల్లా టీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు భారత్‌బంద్‌లో పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేసేందుకు కృషిచేయాలని కో రారు. బంద్‌ను విజయవంతంచేసి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్న రైతులకు అండగా నిలవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.