కేంద్ర వ్యవసాయ బిల్లులతో దళారులకే లాభం

ABN , First Publish Date - 2020-10-03T10:01:41+05:30 IST

కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లుల వల్ల దళారులే లాభం పొందుతారని, రైతులకు కలిగే లాభం ..

కేంద్ర వ్యవసాయ బిల్లులతో దళారులకే లాభం

మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి

కేంద్ర వ్యవసాయ బిల్లులకు  వ్యతిరేకంగా కాంగ్రెస్‌ సంతకాల సేకరణ 


నిజామాబాద్‌ అర్బన్‌, అక్టోబరు 2: కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లుల వల్ల దళారులే లాభం పొందుతారని, రైతులకు కలిగే లాభం లేదని మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి అన్నారు. గాంధీ జయంతిని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని ధర్నాచౌక్‌లో శుక్రవారం కేంద్రప్రభుత్వ రైతు వ్యతిరేక బిల్లులకు నిరసనగా కిసాన్‌-మజ్దూర్‌ బచా వో దివస్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం సంతకాల సేకరణ చేశారు.  కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ  ప్రభుత్వం దేశ అభివృద్ధిని, రైతులను పట్టించుకోకుండా కార్పొరేట్‌ సంస్థలను పెంచి పోషించేందుకే కొత్తకొత్త బిల్లులను ప్రవేశపెడుతుందన్నారు. దేశంలో ఎంతో మంది నిరుద్యోగ యువకులు ఉద్యోగాలు లేకుండా ఉంటే వ్యవసాయ దిగుబడులు పెంచే ప్రయత్నం చేయకుండా దానిని పక్కన పెట్టి  ఓట్ల కోసమే  పనిచేస్తున్నారన్నారు. రైతు కష్టపడి పండించిన పంటను ప్రభుత్వం కొనకుం డా మధ్యలో దళారులు తీసుకునే పరిస్థితి వస్తుందని, దానిని కొన్న దళారులు ఆ పంటను ఇతర దేశాలకు ఎగుమతి చేసి లాభం పొందుతారే తప్పా రైతుకు ఒరిగిందేవిమీ ఉండదన్నారు.


కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ బిల్లుల వల్ల రైతుకు మద్దతు ధర దక్కకపోగా పంటను గ్రేడ్‌లుగా విభజించి ధరలను తగ్గించే ప్రమాదం ఉందన్నారు. బీజేపీ ప్రభుత్వం వల్ల దేశ ప్రజలకు ఒరిగిందేమీ లేదని, బీజేపీ అధికారంలోకి వచ్చాక దేశంలో  అరాచకాలు పెరిగాయన్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో 19 ఏళ్ల యువతిని దారుణంగా అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన ఇందుకు నిదర్శనమన్నారు. జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు మానాల మోహన్‌రెడ్డి, మాజీ విప్‌ అనిల్‌, మాజీ ఎమ్మెల్సీ భూపతిరెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడుగు గంగాధర్‌, అర్బన్‌ ఇన్‌చార్జి తాహెర్‌బిన్‌హుందాన్‌, నగ ర అధ్యక్షుడు కేశ వేణు, కిసాన్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు  ముప్ప గంగారెడ్డి, బీసీ సెల్‌ అధ్యక్షుడు శేఖర్‌గౌడ్‌, ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు భోజన్న, మైనారిటి సెల్‌ అధ్యక్షుడు ఇర్ఫాన్‌ అలీ, ఎస్టీ సెల్‌ అధ్యక్షుడు మోహన్‌ నాయక్‌, వేణురాజ్‌, జావెద్‌ అక్రమ్‌, గడుగు రోహిత్‌, విజయలక్ష్మి, ఉషా తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-10-03T10:01:41+05:30 IST