విద్యార్థులు సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి

ABN , First Publish Date - 2020-12-21T04:57:47+05:30 IST

విద్యార్థులు సమయాన్ని సద్వినియోగం చేసుకున్నప్పుడే గెలుపు వరిస్తోందని బాన్సువాడ డీఎస్పీ జైపాల్‌రెడ్డి అన్నారు.

విద్యార్థులు సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి
గెలుపొందిన విజేతలకు బహుమతులను ప్రదానం చేస్తున్న డీఎస్పీ

బాన్సువాడ, డిసెంబరు 20: విద్యార్థులు సమయాన్ని సద్వినియోగం చేసుకున్నప్పుడే గెలుపు వరిస్తోందని బాన్సువాడ డీఎస్పీ జైపాల్‌రెడ్డి అన్నారు. ఆదివారం బాన్సువాడ పట్టణ సమీపంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో జరిగిన యురేకా-2020 ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేశారు. వివిధ పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మా రోజుల్లో మాకు ఇన్ని సౌకర్యాలు ఉండేవి కావని, ప్రభుత్వం పేద పిల్లలందరికీ విద్యా పరంగా ఎన్నో అవకాశాలను కల్పిస్తోందన్నారు. అలాగే విద్యతో పాటు క్రీడల్లోనూ ప్రోత్సహిస్తోందన్నారు. సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని దేశానికి సేవ చేయాలన్నారు. కార్యక్రమంలో గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్‌ శోభారాణి, స్వేరో నాయకులు అయ్యాల సంతోష్‌, తాడ్కోల్‌ సొసైటీ చైర్మన్‌ పిట్ల శ్రీధర్‌, రమేష్‌, హకీం, గంగారాం తదితరులున్నారు.  
ఎల్లారెడ్డి: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాల యాల సంస్థ యురేకా ఆధ్వర్యంలో ఎల్లారెడ్డి పట్టణంలోని సాంఘిక సంక్షేమ గురుకులంలో ఆదివారం నిర్వహించిన మన ఊరికే మన గురుకులం కార్యక్రమంలో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో మున్సి పల్‌ చైర్మన్‌ సత్యనారాయణ, ఎల్లారెడ్డి సీఐ రాజశేఖర్‌, ప్రిన్సిపా ల్‌ మహేందర్‌, పాఠశాల సిబ్బంది, నాయకులు రాజు, ఇమ్రాన్‌, జగన్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.


విద్యార్థులు బాగా చదివి ఉన్నత స్థాయికి ఎదగాలి
గురుకుల సొసైటీ జాయింట్‌ సెక్రెటరీ అనంతలక్ష్మీ
భిక్కనూరు: విద్యార్థులు బాగా చదివి ఉన్నత స్థాయికి ఎద గాలని గురుకుల సొసైటీ జాయింట్‌ సెక్రెటరీ అనంతలక్ష్మీ అన్నారు. ఆదివారం సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల భిక్కనూరు ఆధ్వర్యంలో మన ఊరికే మన గురుకులం కార్యక్ర మాన్ని నిర్వహించారు. ఈ మేరకు యూరెకా 2020 అనే అంశ ంపై వ్యాసరచన, చర్చ, క్విజ్‌, చిత్రలేఖనం, గానం, నృత్యం కార్య క్రమాలను సీనియర్‌, జూనియర్‌ విభాగాల్లో నిర్వహించారు. ఈ మేరకు జాయింట్‌ సెక్రెటరీ మాట్లాడుతూ విద్యార్థులు కొవి డ్‌ సమయంలో సైతం మన ఊరికే మన గురుకులం కార్యక్ర మానికి ఇంత పెద్దఎత్తున హాజరై విజయవంతం చేయడం సంతోషకరమన్నారు. అనంతరం ఈ పోటీల్లో 218మంది విద్యా ర్థులు పాల్గొనగా పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు ప్రథమ బహుమతి రూ.300లు, ద్వితీయ బహుమతి రూ.200లతో పాటుగా ప్రశంసాపత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్‌ జగదీశ్వర్‌రెడ్డి, వైస్‌ ప్రిన్సిపాల్‌ సాయన్న, ఎంపీటీసీ గజ్జెల్లీ మీనాదుర్గాబాబు, సర్పంచ్‌ శ్రీనివాస్‌, ఉప సర్పంచ్‌ లత, కార్యక్రమ ఇన్‌చార్జి ప్రేమ్‌కుమార్‌, వార్డు సభ్యు లు, నాయకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-21T04:57:47+05:30 IST