కరోనా నియంత్రణకు కఠిన చర్యలు

ABN , First Publish Date - 2020-04-14T12:32:01+05:30 IST

కరోనా నియంత్రణకు కఠిన చర్య లు తీసుకుంటున్నామని కలెక్టర్‌ శరత్‌ అన్నారు. సోమ వారం కామారెడ్డి ఆర్డీవో

కరోనా నియంత్రణకు కఠిన చర్యలు

కామారెడ్డి కలెక్టర్‌ శరత్‌

మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌


కామారెడ్డి, ఏప్రిల్‌ 13: కరోనా నియంత్రణకు కఠిన చర్య లు తీసుకుంటున్నామని కలెక్టర్‌ శరత్‌ అన్నారు. సోమ వారం కామారెడ్డి ఆర్డీవో కార్యాలయంలో వివిధ మండలాల అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. మద్నూర్‌ సరిహద్దులోని రోడ్లను మూసి ఉం చాలని సూచించారు. బ్యాంక్‌ల వద్ద ప్రజలు భౌతిక దూరం పాటించాలని కోరారు. నిబంధనలను అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. మండలస్థాయిలో తహసీల్దార్‌, ఎస్సైపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మండల స్థాయి అధికారులు గ్రామస్థాయిలో పర్యవేక్షణ చేయాలని సూచించారు. అధికారులు అలసత్వం ప్రదర్శిస్తే వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విదేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిని క్వారంటైన్‌లో ఏప్రిల్‌ 21 వరకు కచ్చితంగా ఉండే విధంగా అధికారులు చూడాలని కోరారు.


రోడ్లపై ఉమ్మి వేస్తే వారిపై కేసులు నమోదు చేస్తామని చెప్పారు. వలస కార్మికులకు భోజనం అందించాలని సూచించారు. గ్రామాల్లో ఉపాధి హామీ పనులు జరిగే విధంగా చూడాలని అధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ఇబ్బందులు తలెత్తకుండా వ్యవసాయ అధికారులు చూడాలని సూచిం చారు. ప్రతి ఒక్కరూ మాస్క్‌లు ధరించాలని సూచించారు. లాక్‌డౌన్‌కు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎస్పీ శ్వేతారెడ్డి కోరారు. మహారాష్ట్రలో కరోనా వైరస్‌ తీవ్ర రూపం దాల్చిన నేపథ్యంలో అక్కడి నుంచి వచ్చే వాహనాలను అనుమతిం చవద్దని సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్లు యాదిరెడ్డి, వెంకటేశ్‌ దోత్రే, అసిస్టెంట్‌ కలెక్టర్‌ తేజాస్‌ నందలాల్‌ పవార్‌, జిల్లా వైద్యాధికారి చంద్రశేఖర్‌, డీపీవో సాయన్న, డీఎస్పీ లక్ష్మీనారాయణ, అజయ్‌కుమార్‌, సీఐలు జగదీశ్‌, చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-04-14T12:32:01+05:30 IST