ప్రభుత్వ పాఠశాలలో సరస్వతీ విగ్రహ ప్రతిష్ఠాపన

ABN , First Publish Date - 2020-03-12T11:39:23+05:30 IST

జిల్లా కేంద్రంలోని ఎన్‌జీవోస్‌ కాలనీ ప్రాథమిక పాఠశాలలో బుధవారం సరస్వతీ విగ్రహాన్ని ప్రతిష్ఠా పించారు

ప్రభుత్వ పాఠశాలలో సరస్వతీ విగ్రహ ప్రతిష్ఠాపన

కామారెడ్డిటౌన్‌, మార్చి 11: జిల్లా కేంద్రంలోని ఎన్‌జీవోస్‌ కాలనీ ప్రాథమిక పాఠశాలలో బుధవారం సరస్వతీ విగ్రహాన్ని ప్రతిష్ఠా పించారు. ఈ సందర్భంగా అదన పు కలెక్టర్‌ యాదిరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చక్కటి వాతావరణం ఏర్పాటు చేయడమే కాకుండా చదువుల తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ఆనందించదగి న విషయమని అన్నారు. విద్యార్థులకు మం చి బోధన అందించేందుకు ఉపాధ్యాయులు సైతం తమ వంతు కృషిచేయాలని అన్నా రు. కార్యక్రమంలో డీఈవో రాజు, ఆర్‌డీవో రాజేందర్‌, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ ఇందూ ప్రియ విగ్రహదాత సురేందర్‌ పాఠశాల ప్రధానోపాధ్యాయులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-03-12T11:39:23+05:30 IST