గ్రామాల్లో రాష్ట్ర పరిశీలన బృందం పర్యటన
ABN , First Publish Date - 2020-12-16T04:56:45+05:30 IST
: సుంకెట్ గ్రామంలో మంగళవారం రాష్ట్ర పరిశీలన బృందం ఉపాధి హామీ పనులను పరిశీలించింది. బృందం సభ్యుడు ఎల్‌పీ కృష్ణమూర్తి గ్రామంలో చేపట్టిన పనులను పరిశీలించారు.

మోర్తాడ్, డిసెంబరు15: సుంకెట్ గ్రామంలో మంగళవారం రాష్ట్ర పరిశీలన బృందం ఉపాధి హామీ పనులను పరిశీలించింది. బృందం సభ్యుడు ఎల్‌పీ కృష్ణమూర్తి గ్రామంలో చేపట్టిన పనులను పరిశీలించారు. నీటి గుంతలు, హరి తహారం మొక్కలను, డంపింగ్ యార్డులను పరిశీలించారు. అనంతరం పంచా యతీ కార్యాలయంలో రికార్డులను తనిఖీ చేశారు. మండల ప్రత్యేక అధికారి న ర్సింగ్‌దాస్, ఎంపీడీవో శ్రీనివాస్‌రెడ్డి, ఏపీఎం శకుంతల పాల్గొన్నారు.
వేల్పూర్, రామన్నపేట్ గ్రామాల్లో
వేల్పూర్ : వేల్పూర్, రామన్నపేట్ గ్రామాల్లో ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టిన వివిధ పనులను హైదరాబాద్ కమిషనర్ రూరల్ డెవలప్‌మెంట్ (ఎస్‌పీఎం) అధికారి కృష్ణమూర్తి ఆధ్వర్యంలో పరిశీలించారు. ఆయా గ్రామాల్లో ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టిన పనుల పురోగతికి సంబంధించి వివిధ రికార్డులను పరిశీలించారు. ఆయన వెంట రాష్ట్ర అధికారి నర్సింలు, ఎంపీపీ బీమ జమున, ఎంపీడీవో కమలాకర్‌రావు, సర్పంచ్‌లు తీగెల రాధమోహన్, వీణపురుషోత్తంరెడ్డి, ఉపసర్పంచ్ పిట్ల సత్యం, ఏపీవో అశోక్ ఉన్నారు.