రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఉద్యోగుల నిరసన
ABN , First Publish Date - 2020-12-02T04:37:24+05:30 IST
జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఏఆర్‌టీ సెంటర్ ఎదుట ఏఆర్‌టీ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం వేతన సవరణ కోసం రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఉద్యోగులు నిరసన చేపట్టారు.
పెద్దబజార్, డిసెంబరు 1: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఏఆర్‌టీ సెంటర్ ఎదుట ఏఆర్‌టీ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం వేతన సవరణ కోసం రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఉద్యోగులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఏఆర్‌టీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్‌రెడ్డి మాట్లాడుతూ నేషనల్ యూనియన్ ఇచ్చిన పిలుపు మేరకు సమస్యలను పరిష్కరించడానికి నల్లబ్యాడ్జిలతో వేతన సవరణపై నిరసన చేపట్టినట్లు తెలిపారు. 2014లో ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న ఉద్యోగులకు వేతన సవరణ కొందరికి మాత్రమే ఇచ్చారు. ఏఆర్‌టీ సంస్థ ఉద్యోగులకు ఇవ్వలేదన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వేతన సవరణపై దృష్టిపెట్టాలని కోరారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి మహేందర్, ప్రమోద్, మోహన్‌రావు, కృష్ణ, నీలిమ, రవి పాల్గొన్నారు.