స్టాంప్ పేపర్లు.. ఫుల్‌స్టాక్
ABN , First Publish Date - 2020-12-21T05:01:10+05:30 IST
మార్కెట్లో నాన్ జ్యుడీషియల్ స్టాంప్ పేపర్ల కొరత తీరనుంది. జిల్లా పరిధిలోని 5 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు రెండు రోజుల్లో స్టాంప్ పేపర్లు అందనున్నాయి.

తీరనున్న నాన్ జ్యుడీషియల్‌బాండ్ పేపర్ల కొరత
రెండు రోజుల్లో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు పంపిణీ
చలానాలు చెల్లించగానే స్టాంప్ వెండర్లకు చేరవేత
కామారెడ్డి, డిసెంబరు 20: మార్కెట్లో నాన్ జ్యుడీషియల్ స్టాంప్ పేపర్ల కొరత తీరనుంది. జిల్లా పరిధిలోని 5 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు రెండు రోజుల్లో స్టాంప్ పేపర్లు అందనున్నాయి. అక్కడి నుంచి స్టాంప్ వెండర్లకు సరఫరా అవుతాయి. తొమ్మిది నెలలకు సరిపడా పేపర్లు వచ్చాయని అధికా రులు పేర్కొంటున్నారు. దాదాపు రెండున్నర నెలలుగా నాన్ జ్యుడీషియల్ స్టాంప్ పేపర్లు మార్కెట్‌లో లభించడం గగనంగా మారిన విషయం తెలిసి ందే. పేపర్ల సరఫరా నిలిచిపోవడం, ఆన్‌లైన్‌లో చలానా జనరేట్ కాకపోవ డంతో బాండ్‌ల లభ్యత లేదు. అడపాదడపా అందుబాటులో ఉన్న అధిక ధరలకు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. కొన్ని కార్యాలయాల్లో పరిమిత సంఖ్యలో అందుబాటులో ఉన్న పేపర్లను తీవ్ర కొరత ఉన్న ఎస్‌ఆర్‌ఓలకు తరలించి తాత్కాలికంగా సర్దుబాటు చేసిన దాఖలాలు సైతం ఉన్నాయి. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ పద్ధతిలో ప్రభుత్వ శాఖల ద్వారా అందే పౌర సేవల్లో బాండ్ పేపర్ల ఆవశ్యకత ఎంతో ఉంది.
అన్ని వర్గాలకు తీరనున్న ఇబ్బందులు
ప్రస్తుతం ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ దరఖాస్తుల ప్రక్రి య కొనసాగుతోంది. ఈ దరఖాస్తు సమయంలో సదరు విద్యార్థి 20 స్టాంప్ పేపర్‌పై ఆఫిడివిట్ సమర్పించాలి. అదేవిధంగా జనన, మరణ ధ్రువీకరణ పత్రాల్లో మార్పులు, చేర్పులు, నోటరీలకు ఈ బాండ్ పేపర్లు తప్పనిసరి. అదేవిధంగా వివిధ ఆస్తుల క్రయవిక్రయాల ఒప్పందాలు, రెంట్ అగ్రిమెంట్, అప్పు స్వీకరణ, బ్యాంకులు, ఇతర ఫైనాన్స్ సంస్థల నుంచి రుణాలు పొంద డం తదితర కార్యకలాపాల్లో నాన్ జ్యుడీషియల్ బాండ్ పేపర్లను విస్తృత ంగా వినియోగిస్తున్నారు. వివిధ సాంకేతిక కారణాలతో ఎస్‌ఆర్‌ఓలకు, స్టాం ప్ వెండర్లకు పేపర్ల సరఫరా నిలిచిపోవడంతో కొరత ఏర్పడింది. ఇదే ఆస రాగా స్టాంప్ వెండర్లు సొమ్ము చేసుకున్నారు. రూ.20 విలువ గల బాండ్ పేపర్‌ను రూ.80 వరకు విక్రయిస్తున్నారు. రూ.100 ఉన్న బాండ్ పేపర్‌ను రూ.170 వరకు విక్రయించిన సందర్భాలు ఉన్నాయి. ఇకపై ఆ పరిస్థితి ఉండదని రిజిస్ట్రేషన్ల శాఖధికారులు చెబుతున్నారు. రెండు రోజుల కిత్రమే జిల్లాకు పేపర్ల స్టాక్ రావడంతో అధిక ధరలకు కొనుగోలు చేయాల్సిన పని ఉండదు.
స్వీకరిస్తున్న చలానాలు
స్టాంప్ వెండర్లు ఆన్‌లైన్‌లో చలానా రూపంలో ఫీజు చెల్లిస్తేనే రిజిస్ట్రేషన్ల శాఖ సదరు వెండర్లకు పేపర్లు సరఫరా చేస్తోంది. బాండ్ పేపర్ అవసర మున్న వారు వివరాలు సమర్పించి స్టాంప్ వెండర్ల నుంచి కొనుగోలు చేస్తా రు. అయితే రెండు నెలలుగా సాంకేతిక సమస్యలో చలానాలు జనరేట్ కాలేదు. సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేయకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తిందని అధికారులు పేర్కొంటున్నారు. తాజాగా ఈ సాఫ్ట్‌వేర్ యాక్టివేట్ అయ్యింద ని, చలానాలను తీసుకుంటున్నామని చెబుతున్నారు. చలనాలు చెల్లించగానే రెండు రోజుల్లో స్టాంప్ వెండర్లకు బాండ్ పేపర్లను చేరవేసేందుకు రిజిస్ట్రేష న్ల శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
స్టాంప్ పేపర్ల కొరత తీరనుంది
శ్రీకాంత్, రిజిస్ట్రార్, కామారెడ్డి.
ప్రస్తుతం వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తుల క్రయవిక్రయాల్లో బాండ్ పేపర్ల ఆవశ్యకత లేదు. దీంతో ఇప్పట్లో కొరత ఏర్పడే అవకాశం లేదు. స్టాంప్ వెండర్లు చలానా రూపంలో ఫీజు చెల్లించేందుకు సాఫ్ట్‌వేర్ యాక్టివ్ అయింది. చలానాలు చెల్లించగానే వారికి సరఫరా చేస్తాం. దాదాపు 9 నెలల అవసరాలకు సరిపడా స్టాంప్ పేపర్లు రావడంతో కొరత తీరింది.