నియంత్రిత సాగుతోనే లక్ష్యాన్ని సాధించొచ్చు

ABN , First Publish Date - 2020-05-29T11:09:23+05:30 IST

నియంత్రిత పంటల సాగు విధానంలో అనుకున్న లక్ష్యాన్ని సాధించగలమని శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి

నియంత్రిత సాగుతోనే లక్ష్యాన్ని సాధించొచ్చు

స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి


వర్ని, మే 28 : నియంత్రిత పంటల సాగు విధానంలో అనుకున్న లక్ష్యాన్ని సాధించగలమని శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి స్పష్టం చేశారు. వర్ని మండలం శ్రీనగర్‌, పాతవర్ని గ్రామాల్లో గురువా రం వానాకాలం 2020 వ్యవసాయ ప్రణాళికపై రైతులతో ఏర్పాటుచేసి న అవగాహన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్రస్థాయి లో లాభసాటి వ్యవసాయంపై సీఎం కేసీఆర్‌ నిర్వహించిన సమీక్ష అ నంతరం క్షేతస్థాయిలో రైతుల్లో అవగాహన సదస్సుల ద్వారా సమావే శాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో 2,400 మంది ఏఈవో లు పని చేస్తున్నారని, పంట సాగుపై క్షేత్రస్థాయిలో రైతుల్లో మార్పు తెచ్చే శక్తి ఏఈవోలకే ఉందని స్పీకర్‌ స్పష్టం చేశారు. ఏ గ్రామంలో ఏ పంట సాగుకు అనుకూలమో భూములకనుగుణంగా అధ్యయనం చే సి రైతులకు అవగాహన కల్పించాలని ఏఈవోలకు సూచించారు. ఇష్టా రీతిన పంటల సాగు విధానం శ్రేయస్కరం కాదని, వేలాది రూపాయ లు పెట్టుబడులు పెట్టి చెతికొచ్చాక కొనేవారు లేక నష్టపోయే దుస్థితి అన్నదాతలకు రాకూడదన్నదే ప్రభుత్వ తపనగా పేర్కొన్నారు. పండిం చిన పంట తక్షణమే అమ్ముడుపోయి అప్పులు లేకుండా బ్యాంకుల్లో రై తులు డిపాజిట్‌లు చేసే రోజులు రావాలని పోచారం ఆకాంక్షించారు.


అందుకు ప్రభుత్వం నిర్దేశించిన విధానాలను రైతులు అనుసరించి త మ ప్రాంతాల్లో వ్యవసాయ శాఖ సూచించిన పంటలనే సాగు చేయా లని స్పష్టం చేశారు. సన్నరకాల వరి సాగులో బాన్సువాడ నియోజకవ ర్గం రాష్ట్రంలోనే నెంబర్‌ వన్‌గా నిలిచిందన్నారు. రాష్ట్రంలో 17లక్షల ఎ కరాల్లో కంది, 40లక్షల ఎకరాల్లో సన్నరకం వరి, 18లక్షల ఎకరాల్లో నూ నె గింజలు, 4.50లక్షల ఎకరాల్లో కూరగాయాలు, 2.25లక్షల ఎకరాల్లో పండ్లు, మిగతా ప్రాంతాల్లో పత్తి ఇతర సాగు భూములు అనుకూల ంగా గుర్తించినట్లు పోచారం వెల్లడించారు. సీఎం కేసీఆర్‌ శుక్రవారం కొండపోచమ్మ ప్రాజెక్టును ప్రారంభించనున్నారని వచ్చే ఏడాది నాటికి పూర్తి స్థాయిలో కాళేశ్వరం జలాలు నిజాంసాగర్‌ ప్రాజెక్టుకు చేరనున్నా యని చెప్పారు.


నీటి లభ్యత దృష్ట్యా రోజురోజుకూ పంట విస్తీర్ణం పెరు గుతుందని అందుకు అనుగుణంగా సాగు విధానాలను రైతులు ప్రభు త్వ సూచనలు పాటించాలన్నారు. మండలం యూనిట్‌గా పంటసాగు విధానాన్ని వ్యవసాయశాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు ఖరారు చే సుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్డీవో గోపిరాం, ఎంపీపీ మే క శ్రీలక్ష్మీ, జడ్పీటీసీ హరిదాస్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ సంజీవ్‌, ఏవో నగేష్‌రెడ్డి, ఏఈవో అరుణ్‌కుమార్‌, మండల రైతు సమన్వయ అధ్యక్షు డు సింగంపల్లి గంగారం, విండో చైర్మన్‌ సాయిబాబా, కృష్ణరెడ్డి, సర్పం చ్‌లు శ్రీనగర్‌ రాజు, ఎంబడి పెర్కపద్మ, నానిబాబు, సాయిరెడ్డి, మండ ల టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు ఖలాలిగిరి, అధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-05-29T11:09:23+05:30 IST