ఎన్నికల భారం సొసైటీలదే!
ABN , First Publish Date - 2020-02-08T12:07:26+05:30 IST
సహకార సంఘా ల ఎన్నికల నిర్వహణ భారం రైతులపైనే ప డనుంది. సాధారణంగా ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు ప్రత్యేకంగా నిధులు కేటాయి స్తోంది.

- సొసైటీకి రూ. లక్ష చొప్పున వసూలు చేసిన సహకార శాఖ
- జిల్లాలో 55 సహకార సంఘాల నుంచి రూ.55 లక్షలు డీసీసీబీలో జమ
- అదనపు నిధుల అనుమతి కోసం వినతి
- రాష్ట్ర సహకార ఎన్నికల అథారిటీ ఆధ్వర్యంలో ఎన్నికల నిర్వహణ
- ఎన్నికల నిర్వహణపై అధికారులకు శిక్షణ పూర్తి
కామారెడ్డి: సహకార సంఘా ల ఎన్నికల నిర్వహణ భారం రైతులపైనే ప డనుంది. సాధారణంగా ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు ప్రత్యేకంగా నిధులు కేటాయి స్తోంది. సహకార సంఘాల పరిస్థితి మాత్రం దానికి బిన్నంగా ఉంది. ఆయా సహకార సం ఘాల ఎన్నికలకు అయ్యే ఖర్చుల కోసం సహ కార శాఖ ఇప్పటికే సొసైటీకి రూ. లక్ష చొప్పు న వసూలు చేసింది. జిల్లా వ్యాప్తంగా 55 సొ సైటీల నుంచి రూ. 55 లక్షలు డీసీసీబీలో జ మ చేసినట్లు సమాచారం. ఈ నిధులు సరి పోని పక్షంలో అదనపు నిధులు ఖర్చు చేసేం దుకు అనుమతులు కోరుతున్నారు. గతంలో సహకార సంఘాల ఎన్నికలు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జరిగేవి. నూతన నిబంధనల ప్ర కారం ఈసారి ఎన్నికలను రాష్ట్ర సహకార ఎ న్నికల అథారిటీ ఆధ్వర్యంలో నిర్వహించను న్నారు. సొసైటీ ఎన్నికల నిర్వహణపై జిల్లాలో అధికారులకు శిక్షణను ఇచ్చారు. రిటర్నింగ్ అ ధికారులుగా వ్యవసాయశాఖ అఽధికారులను నియమించారు. సొసైటీకి లక్ష చొప్పున ఎన్ని కల నిర్వహణకు నిధులు వసూలుపై ఓ సం ఘం సొసైటీ సీఈవోను వివరణ కోరగా వా స్తమేనని, తాము రూ. లక్ష పంపించినట్లుగా వివరించారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి రిట ర్నింగ్ అఽధికారులు ఏఆర్‌ఓలను నియమిం చాల్సి ఉంటుంది. వీరు నామినేషన్ పత్రాల నుంచి మొదలుకొని ఫలితాల వరకు నిర్ణ యించిన సంఘం పరిధిలో పనిచేయాల్సి ఉం టుంది. ఎన్నికల నిర్వహణపై వీరికి శిక్షణతో పాటు ఆయా రోజుల్లో టీఏ, డీఏలు చెల్లిం చాల్సి ఉంటుంది. వీటితో పాటు బ్యాలెట్ పే పర్లు, ఓటరు జాబితాల తయారీ, తదితర ఖ ర్చులు ఉంటాయి. సంఘాలకు సంబంధించి న ఎన్నికలు కావడంతో ప్రభుత్వం ఎన్నికలకు అయ్యే ఖర్చులు కూడా ఆయా సంఘాల నుంచి తీసుకుంటుంది. క్రమ పద్ధతిలో, చట్ట బద్దంగా ఎన్నికలను నిర్వహించడమే తమ బాధ్యత అని, వీటికి ప్రత్యేకంగా నిధులు ఉం డవని, అధికారులు అంటున్నారు. గతంలో కూడా సంఘాల నుంచి నిధులు తీసుకొని ఎ న్నికలు నిర్వహించినట్లు అధికారులు చెబు తున్నారు.
ఫ గ్రామాల్లో మళ్లీ మొదలైన ఎన్నికల సందడి..
సహకార ఎన్నికల నగారా మోగడంతో గ్రా మాల్లో మళ్లీ ఎన్నికల వాతావారణం నెలకొం ది. ఓటర్ల సంఖ్య నామామాత్రమే అయినా ఇ టీవల జరిగిన సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో రిజర్వేషన్ల కారణంగా పదవుల పొందలేని నాయకులు సొసైటీ చైర్మన్ స్థానా లపై దృష్టి సారించారు. చైర్మన్ స్థా నాలను ఆశిస్తున్న వారి జాబితా కూడా బాగానే ఉంది.