కలుషిత నీరు తాగి ఆరు పశువుల మృతి

ABN , First Publish Date - 2020-03-08T11:41:22+05:30 IST

కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలోని కాయిత్‌ తండాలో ఒకే కుటుంబానికి చెందిన ఆరు పశువు లు కలుషిత నీరు తా గి మృతి చెందాయి. ఈ సంఘటనకు సం బంధించిన వివరాలు ఇలా

కలుషిత నీరు తాగి ఆరు పశువుల మృతి

గాంధారి, మార్చి7: కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలోని కాయిత్‌ తండాలో ఒకే కుటుంబానికి చెందిన ఆరు పశువు లు కలుషిత నీరు తా గి మృతి చెందాయి. ఈ సంఘటనకు సం బంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కాయి తి తండాకు చెందిన సక్రోత్‌ అనే రైతు తన ఆరు పశువులను తా గు నీటి కోసం వదల డంతో తండాలోని అ వి స్థానిక కుండిలు, పోలంలో నీరు తాగ డంతో అక్కడికక్కడే మృతిచెందాయి. దీంతో ఆ రైతు కన్నిటీ పర్వంతమయ్యారు. పేద రైతు అ యిన సక్రు ఉన్న ఆరు పశువులు చనిపోవడంతో ది క్కు తోచని పరిస్థితులో ఉన్నారు. సమాచారం తెలు సుకున్న గాంధారి పోలీసులు, పశువైద్యాధికారులు పంచానామా నిర్వహించారు.


పశువుల మృతికి చెం దిన పూర్తి వివరాలు పోస్టుమార్టంలో తేలనుంది. పే ద పరిస్థితులో ఉన్న రైతుల ఆవులు చనిపోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆ వుల సహాయంతో వ్యవసాయం చేసుకుంటూ కుటుం బాన్ని పోషించుకుంటూ జీవనం సాగిస్తున్న తరుణం లో ఒక్కేసారి ఇలాంటి పరిస్థితి నెలకొనడంతో ఆ కు టుంబం ఏమి చేయలేని స్థితికి చేరింది. రూ. లక్షల విలువ చేసే పశువులు ఒకేసారి చనిపోవడంతో ఆ కుటుంబం రోడ్డున పడే పరిస్థితి ఏర్పడింది. ప్రభు త్వం స్పందించి రైతు కుటుంబాన్ని ఆదుకోవాలని వి విధ గ్రామాలకు చెందిన ప్రజలు పేర్కొన్నారు. ఈ వి షయం తెలియగానే చుట్టు పక్కల గ్రామాల ప్రజలు ఇక్కడికి చేరుకున్నారు. అక్కడ అక్కడ పడి ఉన్న ఆ వుల కళేబారాలను చూసి చలించిపోయారు.

Updated Date - 2020-03-08T11:41:22+05:30 IST