ప్రైవేటు వాహనాలకు పోలీసు సైరన్‌!

ABN , First Publish Date - 2020-11-28T04:42:51+05:30 IST

అత్యవసర సమయాలలో ఉప యోగించే పోలీసు, అంబులెన్స్‌ల సైరన్‌లను అక్రమ దం దాలకు వినియోగిస్తున్నారు. అత్యవసర సేవలకు ఉపయో గించే సైరన్‌లను ఇతర పనులకు ఉపయోగించరాదన్న ని బంధనను తుంగలో తొక్కి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తు న్నారు.

ప్రైవేటు వాహనాలకు పోలీసు సైరన్‌!
పోలీసు సైరన్‌తో తిరుగుతున్న రుద్రూరు మండలానికి చెందిన వాహనం

అర్థరాత్రి వేళ అక్రమ దందాలకు వినియోగం 

చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్న పోలీసుశాఖ

బోధన్‌, నవంబరు 27 : అత్యవసర సమయాలలో ఉప యోగించే పోలీసు, అంబులెన్స్‌ల సైరన్‌లను అక్రమ దం దాలకు వినియోగిస్తున్నారు. అత్యవసర సేవలకు ఉపయో గించే సైరన్‌లను ఇతర పనులకు ఉపయోగించరాదన్న ని బంధనను తుంగలో తొక్కి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తు న్నారు. అంబులెన్స్‌ల సైరన్‌లను, పోలీసు సైరన్‌లను ప్రై వేటు వ్యక్తులు ప్రైవేటు వాహనాలకు వినియోగించరాద న్న నిబంధనలు ఉన్నా.. అవి ఇక్కడ అమలు కావడం లే దు. ఇష్టారాజ్యంగా ప్రైవేటు వాహనాలకు పోలీసు సైరన్‌ లను ఏర్పాటుచేసి రద్దీ ప్రాంతాలలో, అతివేగం కోసం, అర్థ రాత్రి వేళ దందాలకు వాటిని వినియోగిస్తూ సామాన్య జ నాన్ని భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ప్రైవేటు వాహ నాలు పోలీసు సైరన్‌లు వేయగానే సామాన్య జనం ము ఖ్యమైన వ్యక్తుల వాహనంగా భావించి అడ్డుతప్పుకోవడం తో తమ ఇష్టరాజ్యం అన్నట్లుగా సదరు వ్యక్తులు వ్యవహరి స్తున్నారు. బోధన్‌ డివిజన్‌ పరిధిలో బోధన్‌తో పాటు రు ద్రూరు, వర్ని, కోటగిరి, మోస్రా, చందూరు, రెంజల్‌, ఎడప ల్లి, నవీపేట మండలాలలో పలు ప్రైవేటు వాహనాలకు పోలీసు సైరన్‌లను ఏర్పాటుచేసుకున్నారు. ఈ వాహనాలు పగలు రాత్రి అంటూ తేడా లేకుండా పోలీసు సైరన్‌లతో నడిరోడ్లపైన చెక్కర్లు కొడుతున్నాయి. మరీ ముఖ్యంగా నే తల అండదండలతో ప్రైవేటు వాహనాలకు పోలీసు సైరన్‌ లను ఏర్పాటుచేసుకొని విచ్చలవిడిగా వాహనాలను నడు పుతున్న తీరు భయబ్రాంతులకు గురిచేస్తోంది. కొందరు అర్ధరాత్రి వేళ అక్రమ వ్యాపారాలు చేసే వ్యక్తులు తమ వా హనాలకు పోలీసు సైరన్‌లను ఏర్పాటుచేసి తమ దందాల ను దర్జాగా కొనసాగిస్తున్నారు. కీలక నేతల అండదండలు ఉండడంతో ఈ ప్రైవేటు వాహనాల యజమానులు నేతల పేర్లతో పోలీసులపై ఒత్తిడి తెచ్చి పోలీసు సైరన్‌ల వ్యవహా రంలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఒక్కో మండలం లో పదుల సంఖ్యలో ఇలాంటి ప్రైవేటు వాహనాలు పోలీ సు సైరన్‌లతో దర్జాగా సంచరిస్తున్నాయి. అర్ధరాత్రి వేళ ఇ సుక, గుట్కా ఇతర చీకటి దందాలు సాగించే వ్యక్తులు ప్రై వేటు వాహనాలకు పోలీసు సైరన్‌లను ఏర్పాటుచేసి రాత్రి వేళ హల్‌చల్‌ చేస్తున్నారు. నేతల అండదండలను సాకు గా చూపి పోలీసు సైరన్‌లను ఏర్పాటుచేసి పోలీసుశాఖకు మచ్చతేవడంతోపాటు ప్రజలను భయబ్రాంతులకు వ్యవ హరించేలా గురిచేస్తున్న తీరు అందరిని విస్మయానికి గు రిచేస్తోంది. పోలీసు అధికారులు ఇప్పటికైనా ప్రైవేటు వా హనాలకు పోలీసు సైరన్‌ల పట్ల దృష్టి పెట్టాల్సి ఉంది. మ ండలాలలో ఏఏవాహనాలకు ఎవరెవరు ప్రైవేటు వ్యక్తులు పోలీసు సైరన్‌లను వాడుతున్నరన్న సమాచారం మండల స్థాయి పోలీసులకు ఉన్నా చూసీచూడనట్లుగా వ్యవహరి స్తున్నారు. అధికార పార్టీ అండదండల వల్ల పోలీసులు సైతం మిన్నకుండిపోతున్నారు. కానీ ఈ వ్యవహారాలు సా మాన్య జనాన్ని ముక్కునవేలేసుకునేలా చేస్తున్నాయి. అ త్యవసర సమయాలలో ఉపయోగించే అంబులెన్స్‌, పోలీ సు సైరన్‌లను ప్రైవేటు వ్యక్తులు ఎలా వినియోగిస్తారు? పోలీసులు ఎందుకు చోద్యం చూస్తున్నారన్నది ప్రశ్నార్థకం గా మారింది. ఈ వ్యవహారాల పట్ల పోలీసులు ఇప్పటికైనా కఠినంగా వ్యవహరించకపోతే పరిస్థితి చేజారేలా ఉంది. ఇతరులు సైతం ఇవే సైరన్‌లను తమ వాహనాలకు ఏర్పా టుచేసుకునే ప్రమాదం ఉంది. 

ప్రత్యేక తనిఖీలతో వాహనాలను గుర్తిస్తాం

రామారావు, ఏసీపీ, బోధన్‌

ప్రైవేటు వాహనాలకు పోలీసు సైరన్‌లను ఏర్పాటుచే సుకున్న వ్యవహారంపై విచారణ జరుపుతాం. పోలీసు సైర న్‌లను ప్రైవేటు వాహనాలకు వినియోగించకూడదు. డివి జన్‌ పరిధిలో ప్రత్యేక తనిఖీలు చేపట్టి వాహనాలను గుర్తి ంచి చర్యలు తీసుకుంటాం. ప్రైవేటు వాహనాలకు ఎవరై నా పోలీసు సైరన్‌లు ఏర్పాటు చేసుకున్నట్టయితే తమకు నేరుగా ఫిర్యాదు చేయవచ్చు. అలాంటి వాహనదారులపై కఠిన చర్యలు తీసుకుంటాం.

Updated Date - 2020-11-28T04:42:51+05:30 IST