పోతిరెడ్డిపాడుపై సీఎం మౌనమేలా?
ABN , First Publish Date - 2020-05-18T09:40:40+05:30 IST
పోతిరెడ్డిపాడు నుంచి ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ అక్ర మంగా నీళ్లు తీసుకెళ్తున్నా మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నోరు ఎందుకు మెదపడం లేదని మాజీ మంత్రి షబ్బీర్‌అలీ ఆరోపించారు.

మాజీ మంత్రి షబ్బీర్‌అలీ
భిక్కనూరు, మే 17: పోతిరెడ్డిపాడు నుంచి ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ అక్ర మంగా నీళ్లు తీసుకెళ్తున్నా మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నోరు ఎందుకు మెదపడం లేదని మాజీ మంత్రి షబ్బీర్‌అలీ ఆరోపించారు. ఆదివారం భిక్కనూ రు మండలంలోని బస్వాపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు, వికలాంగులకు నిత్యావసర సరుకులను, నగదును అందజేశారు. ఈ సందర్భంగా షబ్బీర్‌అలీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని నీళ్లు, నిధులు, నియామకాలు అనే మూడు అంశాలపైనే సాధించుకున్నాం కానీ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రస్తుతం నిధులు, నియామకాలు, నీళ్ల మాటనే మర్చిపోయింద న్నారు. రాష్ట్ర ప్రజలు అన్ని గమనిస్తున్నారని అన్నారు. కరోనాతో కలిసి బతకడ మే మార్గమంటున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనాతో కలిసి బతికే మార్గం చూపాలి కదా అని అన్నారు. లాక్‌డౌన్‌లో భాగంగా ఇతర రాష్ట్రాల కూలీల ప్రాణాలు పోతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని ఆరోపిం చారు.
ఒకవైపు రాష్ట్రంలో కరోనా కల్లోలం సృష్టిస్తుంటే సీఎం కేసీఆర్ మాత్రం తన కూతురు మాత్రం ఎమ్మెల్సీ సీటును అప్పజెప్పేందుకు ఎంపీటీసీలను, కౌన్సిలర్‌లను ఇతర పార్టీల నుంచి డబ్బులు ఆశచూపి, బయపెట్టి టీఆర్‌ఎస్‌లో చేర్చుకుంటున్నారని ఆరోపించారు. తాము ఏ పదవిలో లేకపోయినా పేద ప్రజ లకై తోచిన సహాయం చేస్తున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు చంద్రకాంత్‌రెడ్డి, పీసీసీ కార్యదర్శి ఇంద్రకరణ్‌రెడ్డి, మాజీ డీసీసీబీ చైర్మన్ ఎడ్ల రాజారెడ్డి, సర్పంచ్ పోతిరెడ్డి, ఎంపీటీసీ మోహన్‌రెడ్డి, గజ్జెల్లి మీనా, నాయకులు కైలాస్ శ్రీనివాస్‌రావు, ఎల్లం, తుడుం జీవన్, భీంరెడ్డి, సుదర్శన్, దుర్గాబాబు, బాగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.