మైనార్టీ ప్రాంతాలను సీజ్‌ చేయాలి

ABN , First Publish Date - 2020-04-05T11:14:34+05:30 IST

జిల్లాలో కరోనా వైరస్‌ ఒక్కసారిగా విస్తరిస్తున్నందున కట్టడి చేసేందుకు మైనార్టీ ప్రాంతాలను సీజ్‌

మైనార్టీ ప్రాంతాలను సీజ్‌ చేయాలి

కలెక్టర్‌కు ఎంపీ అర్వింద్‌ లేఖ


నిజామాబాద్‌ అర్బన్‌, ఏప్రిల్‌ 4: జిల్లాలో కరోనా వైరస్‌ ఒక్కసారిగా విస్తరిస్తున్నందున కట్టడి చేసేందుకు మైనార్టీ ప్రాంతాలను సీజ్‌ చేయాలని పార్లమెంట్‌ సభ్యుడు ధర్మపురి అర్వింద్‌ జిల్లా కలెక్టర్‌, పోలీసు కమిషనర్‌కు లేఖ రాశారు. జిల్లాలో శుక్రవారం ఒక్కరోజే 17 కేసులు నమోదయ్యాయని వీరంతా ఢిల్లీలో మర్కజ్‌ యాత్రకు వెళ్లిన వారు, వారి కుటుం బసభ్యులు ఉన్నందున ఇది ఆందోళన కలిగించిన విషయమని తెలిపారు.


వీరి ద్వారా కరో నా వైరస్‌ మరింత వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున వారు తిరిగిన ప్రాంతాలను గుర్తించి సీజ్‌ చేయాలని కోరారు. అధికార బృందాలు సర్వేకు వెళ్లిన సందర్భంలో దాడి చేశారని అదే విధంగా గుంపులుగుంపులుగా తిరుగుతూ జిల్లాలో భయాందోళనలు సృష్టిస్తున్నారని వీరికి అడ్డుకట్ట వేసేందుకు సీఆర్‌ఫిఎఫ్‌ బలగాలను రప్పించి ఆఏరియాలను సీజ్‌ చేయాలన్నారు. నగరంలో కరోనా వ్యాప్తిచెందకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కోరారు.

Updated Date - 2020-04-05T11:14:34+05:30 IST