రాజధాని బస్సులో షార్ట్‌ సర్క్యూట్‌

ABN , First Publish Date - 2020-03-24T08:51:24+05:30 IST

నిజామాబాద్‌ ఆర్టీ సీ డిపో-1కు చెందిన రాజధాని ఏసీ బస్సు ముందు భాగం షార్ట్‌సర్క్యూట్‌తో సగం వరకు

రాజధాని బస్సులో షార్ట్‌ సర్క్యూట్‌

సుభాష్‌నగర్‌, మార్చి 23: నిజామాబాద్‌ ఆర్టీ సీ డిపో-1కు చెందిన రాజధాని ఏసీ బస్సు ముందు భాగం షార్ట్‌సర్క్యూట్‌తో సగం వరకు కాలిపోయిం ది. జిల్లా కేంద్రంలోని డిపో-1లో సోమవారం సా యంత్రం సమయంలో టి.ఎస్‌.16 జడ్‌/0225 నెం బర్‌ రాజధాని బస్సును మరమ్మతుల దృష్ట్యా స్టార్ట్‌ చేసే సమయంలో ఇంజన్‌లో మంటలు చెలరే గాయి. అక్కడే ఉన్న ఆర్టీసీ ఉద్యోగులు  మంటల ను అదుపు చేసే ప్రయత్నం చేసి అగ్నిమాపక శా ఖకు ఫోన్‌ చేశారు. దీంతో అగ్నిమాపక శాఖ సి బ్బంది వచ్చి మంటలను ఆర్పివేశారు. బస్సు ముం దు భాగం మొదటి సీటు వరకు పాక్షికంగా కాలిపోయింది. ఉద్యోగులు అప్రమత్తంగా ఉండడం తో భారీ ఆస్తినష్టం తప్పింది. సుమారు రూ.పది లక్షల వరకు నష్టం వాటిల్లిందని ఆర్టీసీ అధికారులు తెలిపారు. 

Read more