రేపు కామారెడ్డిలో షీ టీమ్‌ 2కె రన్‌ : ఎస్పీ

ABN , First Publish Date - 2020-03-13T12:19:00+05:30 IST

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శనివారం ఉదయం 6:30 గంటలకు జిల్లా కేంద్రంలోని సీఎస్‌ఐ చర్చి

రేపు కామారెడ్డిలో షీ టీమ్‌ 2కె రన్‌  : ఎస్పీ

కామారెడ్డి, మార్చి12: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శనివారం ఉదయం 6:30 గంటలకు జిల్లా కేంద్రంలోని సీఎస్‌ఐ చర్చి గ్రౌండ్‌ నుంచి ‘షీ టీమ్‌ 2-కె రన్‌, వాక్‌ కామారెడ్డి’ కార్య క్రమాన్ని నిజాంసాగర్‌ చౌరస్తా వరకు నిర్వహిస్తు న్నట్లు ఎస్పీ శ్వేతారెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పోలీస్‌శాఖ మహిళల రక్షణ కోసం షీ టీమ్‌లను ఏర్పాటు చేసిందని తెలిపారు. మహిళలు, విద్యార్థినుల రక్షణకు చేపడుతున్న పలు కార్య క్రమాలపై మరింత అవగాహన కల్పించడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్యక్ర మంలో ఉత్సాహం ఉన్న విద్యార్థినులు, మహిళలే కా క మహిళల రక్షణ కోసం కట్టుబడి ఉన్నవారందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆమె కోరారు. 

Updated Date - 2020-03-13T12:19:00+05:30 IST