షాడో కమిషనర్‌

ABN , First Publish Date - 2020-12-03T05:30:00+05:30 IST

కామారెడ్డి పట్టణంలోని మున్సిపల్‌ కార్యాలయంలో ఇంజనీరింగ్‌ విభాగంలో ఆయనో ఏఈ. మున్సిపాలిటీలో జరుగుతున్న అభివృద్ధి పనుల విషయం లో కాంట్రాక్టర్లు ఏ విధంగా పనులు చేస్తున్నారు.

షాడో కమిషనర్‌
కామారెడ్డి మున్సిపల్‌ కార్యాలయం

కామారెడ్డి మున్సిపాలిటీలో అనధికారిక కమిషనర్‌
కమిషనర్‌ ఎటువెళ్లినా నీడలా వెళ్తున్న అధికారి
తన విభాగం కంటే కమిషనర్‌ చాంబర్‌లోనే తిష్ఠ
తాను నిర్వర్తించాల్సిన విధులను సైతం
ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బందితో నిర్వహిస్తున్న వైనం
విధుల నిర్వహణ కంటే ఆన్‌లైన్‌ గేమ్‌పైనే ఆసక్తి
కామారెడ్డి టౌన్‌, డిసెంబరు 3: కామారెడ్డి పట్టణంలోని మున్సిపల్‌ కార్యాలయంలో ఇంజనీరింగ్‌ విభాగంలో ఆయనో ఏఈ. మున్సిపాలిటీలో జరుగుతున్న అభివృద్ధి పనుల విషయం లో కాంట్రాక్టర్లు ఏ విధంగా పనులు చేస్తున్నారు. తన విభాగాని కి చెందిన పైఅధికారి అప్పగించిన పనిని సిబ్బంది చేస్తున్నారా.. అలసత్వం వహిస్తున్నారా.. అనే దానిపై దృష్టిపెట్టాలి. దీంతో పాటు నిర్ణీత సమయానికి వచ్చి ఆరోజు ఏ పనులు చేయవలసి ఉంది. తన విధుల్లో నిమగ్నమవాల్సి ఉంది. కానీ కేవలం కార్యా లయంలో ఆన్‌లైన్‌లో గేమ్‌ ఆడుకోవడానికే ప్రభుత్వం తనకు జీతం చెల్లిస్తున్నట్టు ప్రవర్తిస్తున్నాడు. తన విధులను సైతం ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందితో చేయిస్తున్నాడు. ఆటలో బోర్‌ కొడితే కమిషనర్‌ కార్యాలయంలో గంటల కొద్ది మాటామంతి చేస్తు న్నాడు. ఏ రోజుకారోజు విఽధులకు మమ అనిపిస్తున్నారు. నెల నెల జీతం మాత్రం అందుకుంటున్నారు. సదరు ఏఈ ప్రవర్తిస్తున్న తీరుపై దృష్టిసారించి చర్యలు తీసు కోవాల్సింది పోయి తన చాంబర్‌లో చైర్‌పర్సన్‌, ఇతర విభాగాల అధికారుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కూర్చీలో కూర్చోపెట్టుకుని మరీ ముచ్చ టిస్తూ కమిషనర్‌ సైతం చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. ప్రజలు ఏదైన సమ స్య చెప్పుకుందామని కార్యాలయానికి వస్తే గంటల కొద్ది చాంబర్‌ బయటే నిలుచోపెడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. తీరా ఎవరైన కార్మికులు గానీ, ప్రజలు గానీ కమిషనర్‌ దగ్గర కు తమ సమస్య చెప్పుకునేందుకు వస్తే చాలు కమిష నర్‌ కంటే ముందే సదరు ఏఈ సమాధానం చెబుతు ంటారు. సమస్య పరిష్కారానికి అడ్డంకులు వేస్తున్నార ని పలువురు మున్సిపల్‌ కార్మికులు ఏఈ తీరుపై బహిరంగగానే పెదవి విరుస్తున్నారు. తన విభాగంలో కాకుండా నిత్యం కమిషనర్‌ చాంబర్‌లోనే ఫోన్‌లో ఆన్‌లైన్‌ గేమ్‌లు ఆడుతూ కాలక్షేపం చేస్తూ విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్నాడని, కమిషనర్‌కు తనకు అనుకూలంగా లేనివారిపై లేనిపోనివి చెబుతూ పనిచేసే వారిని సైతం ఇబ్బందులకు గురి చేసే ప్రయత్నాలు చేస్తున్నాడని పలువురు కార్యాలయ సిబ్బంది పేర్కొనడం గమనార్హం. ఈ ఏఈ తీరు పట్ల ఇటీవల మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సైతం ఒకింత అసహనం వ్యక్తం చేసినట్లు తెలు స్తోంది.
తన విధులను పక్కన పెట్టి.. కమిషనర్‌తో నీడలా ఉంటున్న వైనం
మున్సిపల్‌లోని వాటర్‌వర్క్స్‌తో పాటు పట్టణంలో జరుగుతు న్న అభివృద్ధి పనుల బాధ్యతలు చూస్తున్న ఏఈ ఈ రెండు పనులను విస్మరిస్తున్నట్టు తెలుస్తోంది. రోజు వారి పనుల్లో భాగంగా తనకు కేటాయించిన విఽభాగానికి చెందిన పైఅధికారితో పాటు కమిషనర్‌కు నిత్యం తనకు కేటాయించిన పనులను వివ రిస్తూ క్షేత్రస్థాయిలో తలెత్తుతున్న సమస్యలను పరిష్కరించే దిశగా కృషి చేయాల్సి ఉంటుంది. ఎప్పుడైన కమిషనర్‌ సదరు అధికారికి కేటాయించిన పనులను పర్యవేక్షించినప్పుడు మాత్రం కమిషనర్‌ వెంట ఉండాల్సింది పోయి ఉదయం కార్యాలయానికి వచ్చింది మొదలు రాత్రి వరకు కమిషనర్‌ కార్యాలయంలోనే ప్రత్యేక చైర్‌లో కూర్చుని షాడో కమిషనర్‌గానే ఉంటున్నారు. తన విధులను మాత్రం ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బందితో చేయిస్తు న్నాడని సమాచారం. ప్రసుత్తం పట్టణంలో అన్ని వార్డులలో పెద్ద ఎత్తున సీసీ రోడ్డులు, డ్రైనేజీల నిర్మాణ పనులు జరుగుతున్నా యి. ఎక్కడైన నాణ్యతాలోపంతో పనులు జరుగుతున్నాయా అని పర్యవేక్షించాల్సింది పోయి కమిషనర్‌ ఎటువెళ్తే అటు నీడలా వెళుతుంటారు. తన పనులను మాత్రం విస్మరిస్తున్నట్లు తెలుస్తో ంది. పట్టణ ప్రజలకు సరఫరా అవుతున్న నీటి సరఫరా ఎక్కువ కావడం వల్ల పలుచోట్ల పైపులైన్లు లీకేజీలు ఏర్పడడం, వాటిని సరిచేసేందుకు వాటర్‌వర్క్స్‌ సిబ్బందికి విధులు కేటాయించాలి. ఆయా కాలనీలో బోర్‌మోటార్లు పాడయితే వాటి రిపేర్‌కు ఆ విభాగానికి సంబంఽధించిన ఉద్యోగికి సూచనలు చేయాలి. వారి హాజరు శాతం ఎలావుంది ఎక్కడైన అలసత్వం ప్రదర్శిస్తున్నారా అనేది పర్యవేక్షించాలి. కానీ అలా కాకుండా కేవలం ఆన్‌లైన్‌ గేమ్‌ లు, కమిషనర్‌ రూంలో మాటామంతితోనే నిత్యం కాలక్షేపం చేస్తుంటాడని పలువురు కౌన్సిలర్‌లు సైతం ‘ఆంధ్రజ్యోతి’కి వివ రించడం కొసమెరుపు. కమిషనర్‌ సైతం కిందిస్థాయి సిబ్బంది విధులను విస్మరిస్తుంటే చర్యలు తీసుకోవాల్సింది పోయి తాను ఎక్కడికి వెళ్లినా సదరు ఏఈకి సంబంధం లేని విభాగాల పరిశీల నకు సైతం వెంటపెట్టుకుని వెళ్తుండడం పట్ల సర్వత్రా విమ ర్శలు వ్యక్తం అవుతున్నాయి.
ఇతర విభాగాలపై పెత్తనం
మున్సిపల్‌ కార్యాలయంలోని ఆయా విభాగాలకు చెందిన పనులకు సంబంధించిన పైళ్లను కమిషనర్‌ దృష్టికి తీసుకు వెళ్తున్న సిబ్బంది టేబుల్‌ మీద పెట్టగానే  కమిషనర్‌ కంటే ముం దే సదరు ఏఈ వాటిని పరిశీలిస్తూ సిబ్బందికి హుకూంలు జారీ చేస్తారు. కమిషనర్‌ చేయాల్సిన, పర్యవేక్షించాల్సిన విభాగాలను షాడో కమిషనర్‌ పర్యవేక్షిస్తూ కేవలం కమిషనర్‌ను సంతకాలకు మాత్రమే పరిమితం చేస్తున్నట్లు ఆయా విభాగాలకు చెందిన సిబ్బంది, కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తన విభాగం లో పనులను నిర్లక్ష్యం వహిస్తూ ఇతర విభాగాల్లో తల దూర్చడమే కాకుండా వారిపై పెత్తనం చెల్లాయించడం, కమి షనర్‌ కార్యాలయంలోనే ఆన్‌లైన్‌ గేమ్‌లు ఆడుతూ కాలక్షేపం చేస్తూ అనధికారిక కమిషనర్‌గా వ్యవహరించడం పట్ల గతంలో ఎన్నడూ ఇట్లాంటి వ్యవహారశైలి ఉన్న అధికారులు కార్యాలయ ంలో కనిపించలేదని ఏళ్లుగా పని చేస్తున్న సిబ్బంది గుసగుస లాడుకోవడం గమనార్హం.

Updated Date - 2020-12-03T05:30:00+05:30 IST