లోక్‌ అదాలత్‌లో కేసుల పరిష్కారం

ABN , First Publish Date - 2020-12-13T05:39:53+05:30 IST

జిల్లా కోర్టు ఆవరణలోని న్యాయసేవా సదన్‌లో శనివారం జాతీయ లోక్‌అదాలత్‌ను నిర్వహించారు.

లోక్‌ అదాలత్‌లో కేసుల పరిష్కారం
చెక్కును అందజేస్తున్న జిల్లా జడ్జి సాయిరమాదేవి

నిజామాబాద్‌ లీగల్‌, డిసెంబరు 12: జిల్లా కోర్టు ఆవరణలోని న్యాయసేవా సదన్‌లో శనివారం జాతీయ లోక్‌అదాలత్‌ను నిర్వహించారు. గత కొన్ని సంవత్సరాలుగా పరిష్కారంకాని కేసులు లోక్‌అదాలత్‌తో పరస్పర అంగీకారంతో రాజీకి వచ్చారని డిస్ట్రిక్ట్‌  ప్రిన్సిపల్‌ అండ్‌ సెషన్స్‌ జడ్జి సా యి రమాదేవి అన్నారు. కేసులు త్వరితగతినా పరిష్కరించేందుకు లోక్‌అదాలత్‌ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ప్రతినెలా జరిగే లోక్‌అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. లోక్‌అదాలత్‌లో మొత్తం 2184 కేసులకు నోటీసులు ఇవ్వగా 1059 కేసులు పరిష్కారమయ్యాయన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయసేవా సంస్థ కార్యదర్శి, సీనియర్‌ సివిల్‌ జడ్జి కిరణ్మయి, ఫ్యామిలీ కోర్టు జడ్జి రత్న పద్మావతి, సీపీ కార్తికేయ, పీపీ మదుసూధన్‌రావు, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు గోవర్ధన్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-13T05:39:53+05:30 IST