వృక్షశాస్త్ర విభాగంలో రెండో రోజు సెమినార్
ABN , First Publish Date - 2020-12-11T05:09:12+05:30 IST
శాస్త్ర సాంకేతిక రంగాలు అభివృద్ధి చెందుతున్న ప్రస్తుత తర ణంలో కొవిడ్ 19 (కరోనా) వైరస్ ప్రపంచ వ్యా ప్తంగా ప్రబలి గర్భిణులపై తీవ్ర ప్రభావం చూ పిందని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ హెల్త్ మాలిక్యులర్, అండ్ సెల్ బయాలజీ ముంబైకి చెందిన ఏమినట్ శాస్త్రవేత్త డాక్టర్ దీపక్ మోదీ అన్నారు.

డిచ్‌పల్లి, డిసెంబరు 10: శాస్త్ర సాంకేతిక రంగాలు అభివృద్ధి చెందుతున్న ప్రస్తుత తర ణంలో కొవిడ్ 19 (కరోనా) వైరస్ ప్రపంచ వ్యా ప్తంగా ప్రబలి గర్భిణులపై తీవ్ర ప్రభావం చూ పిందని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ హెల్త్ మాలిక్యులర్, అండ్ సెల్ బయాలజీ ముంబైకి చెందిన ఏమినట్ శాస్త్రవేత్త డాక్టర్ దీపక్ మోదీ అన్నారు. గురువారం టీయూలో వృక్షశాస్త్ర విభా గంలో కొవిడ్ 19 బేసిక్ టు క్లినికల్ అనే అం శంపై అంతర్జాల ముగింపు సెమినార్ నిర్వహిం చారు. శాస్త్రవేత్తలు డాక్టర్ దీసక్ మోదీ, ఐసీఎం ఆర్ ముంబైకి చెందిన రిటైర్డు డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ తరుల నాందేడ్కర్, డాక్టర్ రావులు గజ్బీయే, కేరళకు చెందిన డాక్టర్ అఖిల్ సీ బెనార్జీ సెమినార్‌లో పాల్గొన్నారు. మానవ మనుగడకు పొంచి ఉన్న కరోనా ప్రభావం, వ్యాధి నివారణ, గర్భిణుల్లో తల్లి నుంచి బిడ్డకు వ్యాధి సంక్ర మించే విధానం, వ్యాధి రోధక శక్తి పెంపొం దించేందుకు గర్భిణులు తీసుకోవాల్సిన జాగ్ర త్తలు, కరోనాతో ఇతర వ్యాధులు ప్రబలే వ్యాధు లపై శాస్త్రవేత్తలు ప్రసంగించారు. ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్, బెంగళూరు, ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ ప్రయాగ్ రాజ్ సౌజన్యంతో ఈ వెబ్ కార్యశాల నిర్వహించినట్లు కో ఆర్డినేటర్ డాక్టర్ అబ్దుల్ హైమాద్ తెలిపారు. కార్యక్రమంలో బీవోఎస్ డాక్టర్ అరుణ, ఆచార్య విద్యావర్ధిని, డాక్టర్ దేవరాజు, శ్రీనివాస్, జలందర్ పాల్గొన్నారు.