నకిలీ విత్తనాలు విక్రయిస్తే కేసులే!

ABN , First Publish Date - 2020-06-19T07:26:39+05:30 IST

నకిలీ మందులు, విత్తనాలు సరఫరా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి అధికారులకు

నకిలీ విత్తనాలు విక్రయిస్తే కేసులే!

మిడతల దండును అరికట్టేందుకు గ్రామాల వారీగా చర్యలు చేపట్టాలి

వీడియో కాన్ఫరెన్స్‌లో అధికారులకు  కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి ఆదేశం


నిజామాబాద్‌, జూన్‌ 18 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): నకిలీ మందులు, విత్తనాలు సరఫరా చేసే వారిపై  కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి అధికారులకు సూచించారు. కలెక్టరేట్‌ నుంచి వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా తహసీల్దార్లు, ఏవోలు ఇతర అధికారులతో సమీక్షించారు. నకిలీ విత్తనాలు అమ్మే వారిపై న కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. రైతులకు విత్తనా లు, ఎరువులపైన పూర్తిస్థాయి అవగాహన కల్పించాలన్నారు. ఎప్పటికప్పుడు అధికారులు నిఘా పెట్టి అరి కట్టాలన్నారు. జిల్లా నుంచి విత్తనాలు ఇతర ప్రాంతాలకు తరలించకుండా చూడాలన్నారు. నిర్లక్ష్యం వహించిన వారిపైన చర్యలు తీసుకుంటామన్నారు. రైతు వే దికల నిర్మాణానికి సంబంధించిన అనుమతులన్నీ వ చ్చే సోమవారం ఇస్తామన్నారు. రైతుబంధు ప్రతి ఒ క్కరికీ వచ్చే విధంగా చూడాలన్నారు. మహారాష్ట్రలో ప్రస్తుతం మిడతలు ఉన్నాయన్నారు. సరిహద్దు జిల్లా లకు వచ్చే అవకాశం ఉందని ఆయన అన్నారు. 


మిడతల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలన్నా రు. గ్రామాల వారీగా ప్రణాళికను రూపొందించి మిడతలను ఎదుర్కొనేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. సీజనల్‌ వ్యాధులు రాకుండా గ్రామాల్లో పారిశుద్ధ్య  కా ర్యక్రమాలను చేపట్టాలన్నారు. ఎప్పటికప్పుడు నీటినిల్వలు లేకుండా చూసి ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. గ్రామాల్లో వైకుంఠధామాల పనులు త్వరగా పూర్తిచేయాలన్నారు. ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ పను లు చేయాలన్నారు. ఏ పనులను కూడా నిర్లక్ష్యం చే యకుండా చూడాలని కోరారు. ఈ  వీడియో కాన్ఫరెన్స్‌లో సీపీ కార్తికేయ, అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌, డీ ఎఫ్‌వో సునీల్‌, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వాజి ద్‌ హుస్సేన్‌ ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-06-19T07:26:39+05:30 IST