టేకు దుంగల పట్టివేత
ABN , First Publish Date - 2020-12-04T05:09:27+05:30 IST
సిరికొండ అటవీ శాఖ రేంజ్ పరిధిలోని వర్జ్య న్తండా పంచాయతీ పరిధిలో గడ్డివాములో దాచిన టేకు దుంగలను గు రువారం అటవీ శాఖ సిబ్బంది పట్టుకుని సిరికొండకు తరలించారు.

సిరికొండ, డిసెంబరు 3 : సిరికొండ అటవీ శాఖ రేంజ్ పరిధిలోని వర్జ్య న్తండా పంచాయతీ పరిధిలో గడ్డివాములో దాచిన టేకు దుంగలను గు రువారం అటవీ శాఖ సిబ్బంది పట్టుకుని సిరికొండకు తరలించారు. రేంజ్ అధికారి వాసుదేవ్ తెలిపిన వివరాల ప్రకారం.. పంచాయతీ పరిధిలోని అ టవీకి ఆనుకొని ఉన్న తండాల పరిధిలో టేకు దుంగల దాచి ఉంచారని సమాచారం అందినట్లు చెప్పారు. సెక్షన్ అధికారి గంగారెడ్డి, సిబ్బందితో వెళ్లి గడ్డివాముల్లో వెతికితే 25 వేల విలువ గల 29 టేకు దుంగలు లభిం చాయన్నారు. వాటిని రేంజ్ కార్యాలయానికి తరలించామని తెలిపారు.