గ్రామాల అభివృద్ధిలో కార్యదర్శులే కీలకం
ABN , First Publish Date - 2020-12-02T04:24:50+05:30 IST
రాష్ట్ర ప్రభుత్వం చే పడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాల్లో కీలక పాత్ర గ్రామ కార్యదర్శులదేనని, అభివృద్ధి పను ల్లో తమవంతు బాధ్యతగా కర్తవ్య నిర్వహణతో ముందుకు సాగాలని అదనపు కలెక్టర్ లత అ న్నారు.

డిచ్‌పల్లి, డిసెంబరు 1: రాష్ట్ర ప్రభుత్వం చే పడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాల్లో కీలక పాత్ర గ్రామ కార్యదర్శులదేనని, అభివృద్ధి పను ల్లో తమవంతు బాధ్యతగా కర్తవ్య నిర్వహణతో ముందుకు సాగాలని అదనపు కలెక్టర్ లత అ న్నారు. మంగళవారం నిజామాబాద్ డివిజన్ లోని ఏడు మండలాల గ్రామ కార్యదర్శులకు మిషన్ అంత్యోదయపై నిర్వహించిన శిక్షణ కా ర్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తడి, పొడి చెత్త సేకరణ సక్ర మంగా చేపట్టాలని, గ్రామ పంచాయతీల రికా ర్డుల నిర్వహణలో ఎలాంటి అలసత్వం వహిం చొద్దని అన్నారు. నూతన గృహాల నిర్మాణ అ నుమతులు వైకుంఠధామాల నిర్మాణాలు వంటి అంశాలపై ఆమె కూలంకశంగా వివరించారు. కార్యదర్శులు ఏమైనా స మస్యలుంటే మండలాలలోని ఎంపీవోలతో గానీ, ఎంపీ డీవోలతో గానీ సమస్యలను నివృత్తి చేసుకోవాని సూ చించారు. కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి జయ సుధ, డివిజన్ పంచాయతీ అధికారి నాగరాజు, ఎంపీపీ భూమన్న, జడ్పీటీసీ ఇందిరా, నడిపల్లి సర్పంచ్ కులచారి సతీశ్, ఎంపీవో రామకృష్ణ పాల్గొన్నారు.