కొవిడ్ ప్రభావం తగ్గినందున పాఠశాలలు తెరవాలి
ABN , First Publish Date - 2020-12-21T04:55:05+05:30 IST
కొవిడ్ ప్రభావం తగ్గినందున పాఠశాలలు తెరిచి 9,10వ తరగతి విద్యార్థులకు ప్రత్యేక్ష బోధనను అందించాలని ఎమ్మెల్సీలు కూర రఘెత్తంరెడ్డి, కాటెపల్లి జనార్ధన్‌రెడ్డిలు అన్నారు.

ఎమ్మెల్సీలు కూర రఘోత్తంరెడ్డి, కాటెపల్లి జనార్ధన్‌రెడ్డి
కామారెడ్డి టౌన్, డిసెంబరు 20: కొవిడ్ ప్రభావం తగ్గినందున పాఠశాలలు తెరిచి 9,10వ తరగతి విద్యార్థులకు ప్రత్యేక్ష బోధనను అందించాలని ఎమ్మెల్సీలు కూర రఘెత్తంరెడ్డి, కాటెపల్లి జనార్ధన్‌రెడ్డిలు అన్నారు. ఆదివారం కామారెడ్డిలో పీఆర్‌టీయూ భవనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ విద్యా సంవత్సరం ప్రారంభం ఆలస్యం కావడం విద్యార్థుల అభివృద్ధిపై, విద్యావ్యవస్థపై చెడు ప్రభావం చూపుతుందని కొవిడ్ ప్రభావం తగ్గినందున పాఠశాలలు ప్రార ంభించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. సాధారణ సమయంలో ఉన్న ట్టు కాకుండా ప్రస్తుతం 3 గంటల పాటు పాఠశాలల పనివేళాలు కుదించాలని, ముందుగా 9,10 తరగతులు ప్రారంభించి దశల వారీగా 6,7,8 తరగుతులు ప్రారం భించాలని అన్నారు. పాఠశాలలో స్కావెంజర్లను తిరిగి తీసుకోవాలని, బదిలీలు ప్రమోషన్లు లేక చాలా కాలం నుంచి విద్యావ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైనందున వెంటనే యాజమాన్యాల వారీగా బదిలీలు ప్రమోషన్లు చేపట్టాలని సీఎం కేసీఆర్‌ను కోరినట్లు తెలిపారు. 1 జూలై 2018 నుంచి అమలు కావాల్సిన పీఆర్‌సీ ఇంకను అమ లు కానందున పీఆర్‌సీ నివేదికను డిసెంబరు 31వ తేదీలోపు తెప్పించుకుని సీఎం ఆమోదిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులు కూడా శక్తి వంచన లేకుండా శ్రమించి కరోనా వల్ల దెబ్బతిన్న విద్యాసంవత్సరాన్ని విద్యార్థులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా పూర్తి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో పీఆర్‌టీ యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కమలాకర్‌రావు, జిల్లా అధ్యక్షుడు దామోదర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి కుషాల్, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి తదిత రులు పాల్గొన్నారు.