36 వేల కిలోమీటర్ల పాదయాత్రతో బాసర సందర్శన

ABN , First Publish Date - 2020-11-27T05:09:51+05:30 IST

36 వేల కిలోమీటర్ల పాదయాత్ర చేస్తూ గురు వారం బాసర సరస్వతీ అమ్మవారి ఆలయాన్ని యాదాద్రి భువనగిరి జిల్లా దేశ్‌ముఖ్‌ గ్రామానికి చెందిన నారాయణ స్వామిజీ సందర్శించారు.

36 వేల కిలోమీటర్ల పాదయాత్రతో బాసర సందర్శన
అమ్మవారిని దర్శించుకున్న నారాయణ స్వామిజీ

బాసర, నవంబరు 26 : 36 వేల కిలోమీటర్ల పాదయాత్ర చేస్తూ గురు వారం బాసర సరస్వతీ అమ్మవారి ఆలయాన్ని యాదాద్రి భువనగిరి జిల్లా దేశ్‌ముఖ్‌ గ్రామానికి చెందిన నారాయణ స్వామిజీ సందర్శించారు. 1998 సంవత్సరం నుంచి లోక కల్యాణార్థం పాదయాత్ర ప్రారంభించారు. స్వామి జీకి ఆలయ పండితులు స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకొని పూజలు చేశారు. 73 ఏళ్ల వయస్సు ఉన్న నారాయణ తన పాదయాత్రతో అనేక పుణ్యక్షేత్రాలను దర్శనం చేసుకున్నారు. కొన్ని క్షేత్రాలను 18 నుంచి 22 సార్లు సందర్శించానని తెలిపారు. రాత్రి, పగలు ఆగకుండా పాదయా త్ర చేయడంతో గిన్నీస్‌బుక్‌ రికార్డులో చోటు లభించిందని తెలిపారు.


Updated Date - 2020-11-27T05:09:51+05:30 IST