పోలీసు బందోబస్తు మధ్య సందీప్‌ అంత్యక్రియలు

ABN , First Publish Date - 2020-09-12T10:21:17+05:30 IST

నందిపేట మండలం లోని కంఠం గ్రామంలో శుక్రవారం ఉదయం సుం కరి సందీప్‌(22) అంత్యక్రియలు భారీ పోలీసు బం దోబస్తు మధ్య ..

పోలీసు బందోబస్తు మధ్య సందీప్‌ అంత్యక్రియలు

నందిపేట, సెప్టెంబరు 11: నందిపేట మండలం లోని కంఠం గ్రామంలో శుక్రవారం ఉదయం సుం కరి సందీప్‌(22) అంత్యక్రియలు భారీ పోలీసు బం దోబస్తు మధ్య నిర్వహించారు. అదే గ్రామానికి చెం దిన బాలికను ప్రేమించిన కారణంగా సుంకరి సం దీప్‌ను అమ్మాయి తరఫు బంధువులు బుధవారం రాత్రి బోధన్‌ పట్టణ శివారులోని అంబేద్కర్‌ కాలనీ లో దారుణంగా కొట్టి హత్య చేసిన విషయం విదిత మే.


ఈ విషయమై కంఠం గ్రామంలో గురువారం రోజంతా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మృతు డి బంధువులు, కుటుంబ సభ్యులకు యువతి ఇం టిపై దాడి చేశారు. ఒక దశలో యువకుడి మృతదే హానికి యువతి ఇంటి ఎదుటే అంత్యక్రియలు నిర్వ హిస్తామని భీష్మించుకు కూర్చోవడంతో పెద్ద ఎత్తు న పోలీసులను మొహరించారు. పరిస్థితిని గమని ంచిన పోలీసు ఉన్నతాధికారులు గ్రామంలో పెద్ద ఎత్తున పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేశారు. శుక్ర వారం ఉదయం అదే పోలీసు బందోబస్తు మధ్య సందీప్‌ అంత్యక్రియలు నిర్వహించారు.

Updated Date - 2020-09-12T10:21:17+05:30 IST