మంజీరా నదిలో ఇసుక తవ్వకాలను నిలిపివేయాలి

ABN , First Publish Date - 2020-09-13T09:26:42+05:30 IST

బీర్కూర్‌ సమీపం లోని మంజీరా పరీవాహక ప్రాంతంలో టీఎస్‌ ఎండీసీ పర్యవేక్షణలో కొనసాగుతున్న ఇసుక తవ్వకాలను వెంటనే ..

మంజీరా నదిలో ఇసుక తవ్వకాలను నిలిపివేయాలి

బీర్కూర్‌, సెప్టెంబరు 12: బీర్కూర్‌ సమీపం లోని మంజీరా పరీవాహక ప్రాంతంలో టీఎస్‌ ఎండీసీ పర్యవేక్షణలో కొనసాగుతున్న ఇసుక తవ్వకాలను వెంటనే నిలిపివేయాలని బీర్కూర్‌ మండల రైతులు, ప్రజా ప్రతినిధులు డిమాండ్‌ చేశారు. శనివారం బీర్కూర్‌ రైతులు, ప్రజా ప్రతినిధులు ఎంపీపీ రఘు అధ్యక్షతన తహ సీల్దార్‌ గణేష్‌తో కలిసి బీర్కూర్‌ మంజీరా నది లో కొనసాగుతున్న ఇసుక తవ్వకాలను పరిశీలి ంచారు. ఈ సందర్భంగా ఎంపీపీ రఘు, ప్రజా ప్రతినిధులు, రైతులు మాట్లాడుతూ బీర్కూర్‌ మంజీరా పరివాహక ప్రాంతంలో ప్రభుత్వం ఇసుక తవ్వకాలకు అనుమతి ఇచ్చిందని, అయి తే సదరు కాంట్రాక్టర్లు తమకు ఇచ్చిన హద్దులు దాటి అడ్డగోలుగా ఇసుక తవ్వకాలను చేపడుతు న్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఇసుక తవ్వకాలను నిలిపివే యాలని రైతాంగాన్ని ఆదుకో వాలని ప్రజా ప్రతి నిధులు, రైతులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌తో చెప్పుకోండని మంజీరా నదిలో ఇసుక తవ్వకాలు నిలిపివేయ మని సదరు కాంట్రాక్టర్‌ తహసీల్దార్‌ గణేష్‌కు ఫోన్‌లో బెదిరించే ప్రయ త్నం చేశారని, ప్రజా ప్రతినిధులు, రైతులు ఆరోపించారు.


తహసీల్దార్‌, ఆర్‌ఐ శ్రీనివాస్‌, ఎస్సై సతీష్‌ వర్మను తీసుకుని ఇసుక క్వారీకి వెళ్లారు. అయితే, క్వారీలో తహసీల్దార్‌ గణేష్‌ ఇసుక తవ్వకాలను పరిశీలించారు. అనంతరం కాంట్రాక్టర్‌తో తహసీల్దార్‌ ఫోన్‌లో మాట్లాడగా.. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు చెప్పుకోండి, ఇసుక తవ్వకాలు ఆపబోమని చెప్పారు. ఇసుక తవ్వ కాలను నిలిపివేస్తే జరిగిన నష్టాన్ని మీ ద్వారా వసూలు చేస్తామని ఒక రకంగా హెచ్చరిం చారు. కేసులు కూడా పెడతామన్నారు. మీకిచ్చి న పరిధిలోనే ఇసుక తవ్వకాలను చేపట్టాలని తహసీల్దార్‌ కాంట్రాక్టర్‌కు చెప్పారు. మంజీరాలో క్వారీ నిర్వహించుకునేందుకు అనుమతులు వచ్చాయని, తమకు అడ్డు చెప్పవద్దని కాంట్రా క్టర్‌ తహసీల్దార్‌తో పేర్కొన్నారు. ఏదైనా ఉంటే టీఎస్‌ ఎండీసీ అధికారులతో మాట్లాడుకోవాలని సూచించారు. సోమవారం తాను తహసీల్‌ కార్యాలయానికి వచ్చి మాట్లాడతానని చెప్పడం తో ప్రజా ప్రతినిధులు, రైతులు, అధికా రులు మారు మాట్లాడకుండా వెనుదిరిగారు.

Updated Date - 2020-09-13T09:26:42+05:30 IST