అధికారులకు సలాం

ABN , First Publish Date - 2020-03-24T10:54:52+05:30 IST

కరోనా(కోవిడ్‌-19) వైరస్‌ గంటగంటకు విస్తరిస్తూ వణికిస్తోంది. ఇలాం టి విపత్కర పరిస్థితుల్లోనూ ప్రభుత్వ సిబ్బంది అం కితభావంతో...

అధికారులకు సలాం

కరోనా వైరస్‌ను అడ్డుకోవడానికి గ్రామాల్లో పర్యటిస్తున్న వైద్య, రెవెన్యూ, పోలీసు శాఖాధికారులు

విదేశాల నుంచి వచ్చే వారి వివరాల సేకరణ.. హోం క్వారంటైన్‌లో ఉంచి నిత్యం పర్యవేక్షణ

ఎల్లారెడ్డి టౌన్‌, మార్చి 22: కరోనా(కోవిడ్‌-19) వైరస్‌ గంటగంటకు విస్తరిస్తూ వణికిస్తోంది. ఇలాం టి విపత్కర పరిస్థితుల్లోనూ ప్రభుత్వ సిబ్బంది అం కితభావంతో విధులను నిర్వహిస్తూ ఔర.. అనిపిం చుకుంటున్నారు. కరోనా వ్యాప్తిని అడ్డుకోవడానికి దే శ ప్రధానీ మోదీ, సీఎం కేసీఆర్‌లు ఇచ్చిన పిలుపు మేరకు జిల్లా కలెక్టర్‌ శరత్‌ ఆధ్వర్యంలో వైద్య, పో లీసు, రెవెన్యూ శాఖల వారు మాత్రం ప్రజల్లో ఈ వ్యాధి నిర్మూలకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగా హన కల్పిస్తున్నారు. ఒకరికొకరు సమన్వయంతో పనిచేస్తూ, వ్యాధిని నివారించడానికి ప్రజలు తీసుకో వాల్సిన చర్యలపై వారిలో చైతన్యం తీసుకువస్తున్నా రు. స్వయంగా ఇంటింటికి తిరుగుతూ వ్యాధి వ్యాప్తి తో జరిగే నష్టాలను, వ్యాధిని నివారిస్తే కలిగే లాభా లను వివరించి ఆత్మస్థైర్యాన్ని నింపుతున్నారు.


ము ఖ్యంగా వివిధ దేశాల నుంచి వచ్చిన వారిలోనే ఎ క్కువగా ఈ వ్యాధి లక్షణాలు కన్పిస్తుండడంతో జి ల్లాకు ఇతర దేశాల నుంచి వచ్చిన వారి వివరాలను జల్లెడ పడుతున్నారు. ఎర్రటి ఎండను లెక్క చేయ కుండా గ్రామాల్లోని ఇంటింటికీ తిరుగుతూ ఇతర దే శాల నుంచి వచ్చిన వారిని గుర్తించి, వారిని వారి ఇ ళ్లల్లోనే కనీసం 14రోజుల పాటు స్వీయ నిర్భందంలో ఉండేలా చర్యలు చేపడుతున్నారు. వ్యాధి లక్షణాలు కనిపించిన వారిని వెంటనే మెరుగైన చికిత్స కోసం గాంధీ ఆసుపత్రిలోని ఐసోలేషన్‌ వార్డుకు రిఫర్‌ చే స్తున్నారు. ఆదివారం నిర్వహించిన జనతా కర్ఫ్యూ లో ప్రజలను ఓవైపు సోషల్‌ మీడియా ద్వారా, మ రోవైపు చప్పట్లతో, మైక్‌ అనౌన్స్‌మెంట్‌లతో కల్పిం చి వారిలో చైతన్యాన్ని తీసుకురావడంలో ప్రధాన పా త్రను పోషించారు. జిల్లాలో కరోనా వ్యాధిని అడ్డుకో వడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నారు. అధికార యంత్రాంగం కష్టకాలంలో అంకితభావంతో పని చేస్తున్నారన్న మన్నలను పొందుతున్నారు.


వైరస్‌పై వైద్యుల అవగాహన సదస్సులు

కరోనా వ్యాధి నేపథ్యంలో ప్రజలు ఏమాత్రం నిర్ల క్ష్యం వహించినా జరిగే పరిణామాలపై ఎప్పటికప్పు డు వైద్యులు, వైద్య సిబ్బంది ప్రజల్లో చైతన్యాన్ని తీ సుకువస్తున్నారు. కలెక్టర్‌ శరత్‌ ఆదేశాలు, వైద్యశాఖ సూచనల మేరకు పట్టణాలు, గ్రామాలకు కదిలిన వైద్యులు, వైద్య సిబ్బంది ఇంటింటికీ తిరుగుతూ ప్ర జలకు వ్యాధి నివారణకు తీసుకోవాల్సిన అంశాలను వివరిస్తున్నారు. ఆయా మండలాల వారిగా గ్రామ సభలు, ప్రత్యేక సమావేశాల నిర్వహించి కరోనా వై రస్‌పై అవగాహన కల్పిస్తున్నారు. పట్టణాల్లో ఏర్పా టు చేసిన ఐసోలేషన్‌ వార్డుల్లో వైద్యులు, గ్రామీణ ప్రాంతాలలో పీహెచ్‌సీల వైద్యులు, వైద్య సిబ్బంది, ఆశాలు ఇలా ఆరోగ్య సిబ్బంది పూర్తిగా ఈ వ్యాధి నిర్మూలనకు అంకితభావంతో పనిచేస్తున్నారు. ఇత ర దేశాల నుంచి గ్రామీణ ప్రాంతాలకు వచ్చిన వారి ని కలిసి వారిని క్వారంటైన్‌లో ఉంచి వైద్యపరీక్షలు నిర్వహిస్తున్నారు. 


ప్రజలతోనే రెవెన్యూ, పోలీసు శాఖాధికారులు

 వైద్యశాఖ, పోలీసు, రెవెన్యూ శాఖల పనితీరుపై ప్రశంసల జల్లు కురుస్తోంది. కరోనా వ్యాప్తికి అడ్డుక ట్ట వేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుం టున్న నిర్ణయాలను అమలు చేయడంలో వీరు కీల క పాత్రను పోషిస్తున్నారు. ఇళ్ల నుంచి బయటకు రాకుండా ఉదయం నుంచి రాత్రి వరకు పర్యటిస్తు న్నారు. మొత్తంగా జిల్లా అధికార యంత్రాంగం కరో నా వ్యాప్తిని అడ్డుకట్ట వేయడంలో తమ వంతు పా త్ర పోషిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.

Updated Date - 2020-03-24T10:54:52+05:30 IST