నేడు రైతుల ఖాతాల్లోకి రైతుబంధు

ABN , First Publish Date - 2020-12-28T05:10:35+05:30 IST

యాసంగి పంటల సాగుకు ప్రభుత్వ ఆర్థిక సహాయం అందబోతుంది. రైతుబంధు పథకంలో భాగంగా పెట్టుబడి కింద రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న సొమ్ము రైతుల బ్యాంకు ఖాతాలలో జమ కానుంది. నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల్లో అర్హులైన రైతులందరికీ సోమవారం నుంచి అందను ంది. ఎకరానికి రూ.5వేల చొప్పున రైతుల ఖాతాలో చేరనుంది.

నేడు రైతుల ఖాతాల్లోకి రైతుబంధు

నేటి నుంచి రైతుల బ్యాంకు ఖాతాల్లోకి రైతుబంధు సొమ్ము

ఈ సారి విడతల వారీగా బ్యాంకు ఖాతాలో నగదు జమ

ఉమ్మడి జిల్లాలోని చిన్న, సన్నకారు రైతులకు తొలి ప్రాధాన్యం

వచ్చే నెల 7వ తేదీలోగా పట్టాదారులందరికీ పంపిణీ

నిజామాబాద్‌ జిల్లాలో 2.55 లక్షల మంది రైతులకు రూ.270 కోట్లు 

కామారెడ్డిలో 2.60 లక్షల మందికి రూ.259 కోట్లు అవసరం

ఉమ్మడి జిల్లాలో కొత్తగా 24 వేల మంది రైతులకు అర్హత

కామారెడ్డి, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): యాసంగి పంటల సాగుకు ప్రభుత్వ ఆర్థిక సహాయం అందబోతుంది. రైతుబంధు పథకంలో భాగంగా పెట్టుబడి కింద రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న సొమ్ము రైతుల బ్యాంకు ఖాతాలలో జమ కానుంది. నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల్లో అర్హులైన రైతులందరికీ సోమవారం నుంచి అందను ంది. ఎకరానికి రూ.5వేల చొప్పున రైతుల ఖాతాలో చేరనుంది. ఇందుకు సంబంధించిన కసరత్తును ఉమ్మడి జిల్లా వ్యవ సాయశాఖ అధికారులు పూర్తిచేశారు. యాసంగి సీజన్‌ సా గుకు రైతులు సన్నద్ధం అవుతున్నారు. గతానికి భిన్నంగా ఈ సారి సీజన్‌ ఆరంభంలోనే సొమ్ము దక్కనుండడంతో రైతు లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గతం కంటే ఈ సారి ఎ క్కువ సంఖ్యలో రైతులకు లబ్ధిచేకురనుంది. ఉమ్మడి జిల్లా లో 5 లక్షల మందికిపైగా లబ్ధిదారులకు రూ.529 కోట్ల నిధు లు అవసరం కానున్నాయి. అయితే గతంతో పోలీస్తే ఈ సీ జన్‌లో విడుతల వారీగా రైతులకు రైతుబంధు సహాయాన్ని రైతుల బ్యాంక ఖాతాలలో జమ చేయనున్నారు.

ఐదు లక్షల మందికిపైగా లబ్ధిదారులు

నిజామాబాద్‌, కామారెడ్డి జి ల్లాల్లో రైతుబంధుకు ఈ యాసంగి సిజన్‌లో 5 లక్షల మందికిపైగా రైతు లకు లబ్ధిచేకురనుంది. నిజామాబాద్‌ జి ల్లాలో ఈ యాసంగి సీజన్‌లో 2,55,620 మం ది రైతుబంధుకు అర్హులుగా అధికారులు గుర్తించారు.  వీరికి రూ.270 కోట్లు అవసరం కానున్నాయి. గత వానాకాల ం సీజన్‌లో 2,39,000ల మందికి రూ.252 కోట్లు కేటాయిం చారు. అదే విధంగా కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా 2.60 లక్షల మంది పట్టాదారులు రైతుబంధుకు అర్హత సాధించినట్లు వ్యవసాయ అధికారులు పేర్కొంటున్నారు. వీరికి ఈ సీజన్‌ లో పెట్టుబడి కింద రూ.259 కోట్లు రైతుల బ్యాంకు ఖాతాలలో జమకానున్నాయి. గత వానాకాలం సీజన్‌లో జిల్లాలో 2,49,000ల మంది రైతుల ఖాతా లలో రూ.242 కోట్లు జమ చేశా రు. చిన్న, సన్నకారు రైతులకు తొలి ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఆ తర్వాత పెద్ద రైతులకు సొ మ్ము దక్కనుంది. ఇలా వచ్చేనె ల జనవరి 7వ తేదీలోగా అర్హుల ందరికీ విడతల వారీగా లబ్ధిచేకూ రుతుందని వ్యవసాయ అధికారులు పేర్కొంటున్నారు. 

కొత్తగా 24 వేల మందికి లబ్ధి

ఉమ్మడి జిల్లాలో గతంతో పోలిస్తే ఈ యాసంగి సీజన్‌లో రైతుబంధుకు కొత్తగా 24 వేల మందికిపైగా అర్హులుగా సాఽ దించినట్లు వ్యవసాయ శాఖ అధికారుల లెక్కలు చెబుతు న్నాయి. నిజామాబాద్‌ జిల్లాలో గత వానాకాలం సీజన్‌లో 2,39,000ల మంది రైతుబంధుకు అర్హులు కాగా.. ఈ యా సంగిలో 2,55,620 మంది అర్హులుగా గు ర్తించారు. ఈ లెక్కన నిజామాబాద్‌ జిల్లా లో కొత్తగా 16,625 మంది రైతుబంధు జాబితాలో చేరారు. కామారెడ్డి జిల్లాలో గత వానాకాలం సీజన్‌లో 2.49 లక్షల మంది పట్టాదారులు రైతు బంధుకు అర్హత సాధించగా.. ఈ సీజన్‌లో అదనంగా మరో 8 వేల పైచిలుకు ఖాతాలు పెరిగాయి. వీరికి కూడా పెట్టుబడి సొ మ్ము దక్కనుంది. కొత్తగా పాసుపుస్తకాలు పొందిన ఈ ప ట్టాదారుల నుంచి వ్యవసాయశాఖ అధికారులు వివరాలు సేకరించారు. ఇప్పటి వరకు 50 శాతం మంది వివరాల సేక రణ జరిగిందని సంబంధిత శాఖ అధికారులు పేర్కొంటు న్నారు. బ్యాంకు ఖాతా వివరాలు, ఆధార్‌ నంబర్‌, పట్టాదా రు పాసుపుస్తకాల సమాచారాన్ని వ్యవసాయశాఖ అధికారు లకు అర్హులైన రైతులు అందజేయాల్సి ఉంటుంది. ఇప్పటివ రకు వివరాలు సమర్పించని వారు విలైనంత త్వరగా స్థాని క వ్యవసాయ విస్తీర్ణ అధికారికి అప్పగించాలని అధికారులు సూచిస్తున్నారు.

విడతల వారీగా రైతుబంధు

రాష్ట్ర ప్రభుత్వం కరోనా నేపథ్యంలో ఆర్థిక నష్టాలు ఉం టున్నప్పటికీ రైతులకు మాత్రం పఽథకాల ద్వారా అందే సొ మ్మును సమయానికి అందించాలని నిర్ణయించింది. ఇందు లో భాగంగానే ప్రతీ సీజన్‌లాగే ఈ యాసంగిలోను రైతుల కు రైతుబంధు ద్వారా ఎకరానికి రూ.5వేల చొప్పున అందిం చేందుకు ప్రభుత్వం ప్రత్యేక నిధిని విడుదల చేసింది. అయి తే గతంతో పోలీస్తే ఈ సారి రైతు బంధు విడతల వారీగా అందించేందుకు నిర్ణయించింది. చిన్న, సన్నకారు రైతులకు మొదటి ప్రాధాన్యత కింద ఆయా రైతుల బ్యాంకు ఖాతాల లో నగదును జమచేయనుంది. తర్వాత పెద్ద రైతులకు వి డుదల చేయనున్నారు. అయితే ఉమ్మడి నిజామాబాద్‌ జి ల్లాలో మొత్తం 2.60 లక్షల మంది అర్హులైన రైతులు ఉన్నా రు. వీరిలో ఒక ఎకరం నుంచి 2 ఎకరాల వరకు ఉన్న రైతు లు 1.50 వేల మంది ఉన్నట్లు వ్యవసాయశాఖ అధికారులు గుర్తించారు. వీరందరికీ మొదటి విడుతలోనే రైతుబందు నగదు జమ చేయనున్నారు. అదేవిధంగా మూడు ఎకరాల నుంచి 5 ఎకరాల వరకు 90 వేలమంది రైతులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీరికి రెండో విడుతలో రైతుబంధు డబ్బులు జమ కానున్నాయి.5 ఎకరాలకుపైగా ఉన్న రైతులు 20 వేల మంది రైతులు ఉన్నట్లు గుర్తించారు. వీరికి చివరి విడతలో నగదును విడుదల చేయనున్నారు.

Updated Date - 2020-12-28T05:10:35+05:30 IST