నేటి నుంచి రైతుబజార్‌, డైలీ మార్కెట్‌ల మూసివేత

ABN , First Publish Date - 2020-03-25T16:20:48+05:30 IST

కామారెడ్డి పట్టణంలోని రైతు బజార్‌, డైలీ మార్కెట్‌ను మూసివేయడం జరుగుతుందని ఇన్‌చార్జి మున్సిపల్‌ కమిషనర్‌ అమీన్‌సింగ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. పట్టణంలోని నాలుగుచోట్ల దేవునిపల్లి హైస్కూల్‌, హౌసింగ్‌బోర్డు కాలనీలో గణేష్‌ టెంపుల్‌,

నేటి నుంచి రైతుబజార్‌, డైలీ మార్కెట్‌ల మూసివేత

కామారెడ్డిటౌన్: కామారెడ్డి పట్టణంలోని రైతు బజార్‌, డైలీ మార్కెట్‌ను మూసివేయడం జరుగుతుందని ఇన్‌చార్జి మున్సిపల్‌ కమిషనర్‌ అమీన్‌సింగ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. పట్టణంలోని నాలుగుచోట్ల దేవునిపల్లి హైస్కూల్‌, హౌసింగ్‌బోర్డు కాలనీలో గణేష్‌ టెంపుల్‌, సీఎస్‌ఐ చర్చి ప్రాంగణం, రాజీవ్‌ పార్క్‌ ఎదురుగా కూరగాయల విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలు ఇంటికి ఒక్కరే మాత్రమే రావాలని ఉదయం 5 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే ఈ కేంద్రాలు ఉండనున్నాయని తెలిపారు. అంతేకాకుండా నిత్యవసర సరుకులు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తెరిచి ఉంటా యని తెలిపారు. ప్రజలు ద్విచక్రవాహనాములపై ఒక్కరు, కార్లలో అయితే ఇద్దరు మాత్రమే జిల్లా యంత్రాంగం నిర్దే శించిన సమయంలో తీసుకొని వెళ్లాలని తెలిపారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే క్రిమినల్‌ చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Updated Date - 2020-03-25T16:20:48+05:30 IST