న్యూ ఇయర్‌ వేడుకల్లో నిబంధనలు పాటించాలి : సీపీ

ABN , First Publish Date - 2020-12-31T04:53:43+05:30 IST

జిల్లాలో కొత్త సంవత్సరం వేడుకల పేరు మీద రోడ్ల మీదికి ప్రజలు రావద్దని నగర పోలీస్‌ కమిషనర్‌ కార్తికేయ ఒక ప్రకటనలో తెలిపారు.

న్యూ ఇయర్‌ వేడుకల్లో నిబంధనలు పాటించాలి : సీపీ

నిజామాబాద్‌  అర్బన్‌, డిసెంబరు 30: జిల్లాలో కొత్త సంవత్సరం వేడుకల పేరు మీద రోడ్ల మీదికి ప్రజలు రావద్దని నగర పోలీస్‌ కమిషనర్‌ కార్తికేయ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతిఒక్కరూ కొవిడ్‌ నిబంధనలు పాటించాలన్నారు. జిల్లాలో మద్యంషాపులు, కల్లు దుకాణాలు నిర్ణీత సమయం వరకే తెరిచిఉంచాలని పేర్కొన్నారు. గురువారం అంతకు మించి ఎక్కువ సమయం షాపులను  తెరిచి ఉంచితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. లైసెన్స్‌లను కూడా రద్దుచేస్తామని హెచ్చరించారు. ఎక్కడ కూడా ఆర్కెస్ట్రాకు, సౌండ్‌ సిస్టంకు అనుమతి లేదని తెలిపారు. బయట ఎక్కడ సిట్టింగ్‌లు ఏర్పాటు చేసినా కేసులు నమోదు చేస్తామని తెలిపారు. న్యూఇయర్‌ వేడుకలు  జరుపుకునే వారు ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాలని సూచించారు.


Updated Date - 2020-12-31T04:53:43+05:30 IST