బైక్‌ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు

ABN , First Publish Date - 2020-12-06T06:15:23+05:30 IST

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని హౌసింగ్‌ బోర్డువద్దనున్న కస్తూరిబాయి ఆసుపత్రి వద్ద శనివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో బైక్‌ను ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో బైక్‌పై వెళ్తున్న ఒకరు మృతిచెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.

బైక్‌ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు
ఘటనా స్థలిలో బాధితులు

ఒకరు మృతి.. మరొకరికి గాయాలు
కామారెడ్డి, డిసెంబరు 5: కామారెడ్డి జిల్లా కేంద్రంలోని హౌసింగ్‌ బోర్డువద్దనున్న కస్తూరిబాయి ఆసుపత్రి వద్ద శనివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో బైక్‌ను ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో బైక్‌పై వెళ్తున్న ఒకరు మృతిచెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. కామారెడ్డి పోలీసుల కథనం మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌ మండలం నామపూర్‌కు చెందిన మెరుగు నర్సాగౌడ్‌ (56), నారాగౌడ్‌ బైక్‌పై వస్తుండగా, కామారెడ్డి కస్తూరిబాయి ఆసుపత్రి ఎదురుగా కామారెడ్డి డిపో నుంచి యాడారం వెళ్తున్న టీఎస్‌ 17 టీ 5846 ఆర్టీసీ బస్సు ఢీకొని మెరుగు నర్సాగౌడ్‌ పైనుంచి టైర్‌ వెళ్లడంతో ఆతను అక్కడికక్కడే  మృతిచెందాడు. అదే బైక్‌పై ప్రయాణిస్తున్న నారాగౌడ్‌కు గాయాలయ్యాయి. నామపూర్‌ నుంచి స్వంత పనిమీద ఇద్దరూ బైక్‌పై కామారెడ్డికి వచ్చారు. ప్రమాదంలో ఒకరు మృతిచెందడం, మరొకరు గాయపడడం స్థానికులను కలిచి వేసింది. గాయపడిన నారాగౌడ్‌ను చికిత్స నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నర్సాగౌడ్‌ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు పట్టణ ఎస్‌ఐ రవికుమార్‌ తెలిపారు. నర్సాగౌడ్‌ బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నా మని ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - 2020-12-06T06:15:23+05:30 IST