రూ. 20లక్షల విలువైన పసుపు అగ్గిపాలు
ABN , First Publish Date - 2020-03-13T12:06:41+05:30 IST
పసుపు లోడుతో వెళ్లున్న లారీ ప్రమాదవశాత్తు డీజిల్ ట్యాంకర్ పేలి దగ్ధమైన ఘటన గురువారం నిజామాబాద్ జిల్లా

డీజిల్ ట్యాంకర్ పేలి పసుపు లోడుతో వెళ్తున్న లారీ దగ్ధం
294 బస్తాల పసుపు అగ్నికి ఆహుతి
డ్రైవర్, క్లీనర్‌లకూ అంటుకున్న మంటలు
చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలింపు
కొత్తపల్లి శివారులో చోటుచేసుకున్న ఘటన
ముప్కాల్, మార్చి 12: పసుపు లోడుతో వెళ్లున్న లారీ ప్రమాదవశాత్తు డీజిల్ ట్యాంకర్ పేలి దగ్ధమైన ఘటన గురువారం నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండలం కొత్తపల్లి శివారులో చోటుచేసుకుంది. మెం డోర మండలం వెల్కటూర్ నుంచి 294 పసుపు బస్తా ల లోడ్‌తో నిజామాబాద్ మార్కెట్‌కు వెళ్తున్న టీఎస్ 16 యూబీ 4647 నెంబర్ గల లారీ ముప్కాల్ మం డలంలోని కొత్తపల్లి శివారుకు చేరుకోగానే ఒక్కసారి గా మంటలు చెలరేగి నిప్పంటుకుంది. అప్పటికే రెంజ ర్ల గ్రామం నుంచి డీజిల్ లీక్ అవుతున్న విషయాన్ని గమనించిన కారులో వచ్చే వ్యక్తి లారీని అనుకరిస్తూ లారీ డ్రైవర్‌కు సమాచారం ఇచ్చాడు. అప్రమత్తమైన డ్రైవర్ సుధాకర్, క్లీనర్ అజయ్ వెంటనే లారీని నిలిపి వేసి మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. అప్పటికే మంటలు చెలరేగాయి.
మంటలను ఆర్పేం దుకు ప్రయత్నించిన సుధాకర్, క్లీనర్ అజయ్‌కి మం టలు అంటుకున్నాయి. రైతులు ఫైర్ ఇంజన్‌కు సమా చారం అందించి సాహసించి లారీలో ఉన్న కొంత ప సుపును కిందికి దింపారు. ఫైర్ ఇంజన్ వచ్చేలోపే లారీ ముందు భాగం సహా అందులో ఉన్న బస్తాలు అగ్నికి ఆహుతయ్యాయి. అగ్ని ప్రమాదంలో 90శాతం పసుపు కాలిపోయింది. సుమారు రూ.20లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వే స్తున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పసుపు కళ్ల ముందే కాలిపోతుంటే జీర్ణించుకోలేక పోలీసులు అడ్డగించినా రైతులు కాలుతున్న లారీలో నుంచి పసుపును కాపా డుకునే ప్రయ త్నం చేసినా అ ప్పటికే జరగాల్సి న నష్టం జరిగిం ది. ఫైర్ ఇంజన్ అందుబాటులో ఉండి ఇంత నష్టం జరిగేది కాదని రైతులు వాపోతున్నారు.
ఎస్సై రాజ్ భ రత్‌రెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని లారీ యజ మాని గంగారెడ్డి ఇచ్చిన వివరాలు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. వ్యవసాయ, రెవె న్యూ, ఉద్యానవన అధికారులు సంఘటన స్థలానికి వ చ్చి పంచనామా చేశారు. ఉద్యానవన శాఖ అధికారి ఇచ్చిన వివరాల ప్రకారం 11 మంది రైతుల 294 బ స్తాలు 230 కుంటల ఈ రోజు ధర ప్రకారం క్వింటా లుకు రూ.5,500 చొప్పున రూ.12 లక్షల 65వేలుగా అంచనా వేశారు.