రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

ABN , First Publish Date - 2020-12-19T06:03:35+05:30 IST

ఎల్లారెడ్డి ఆర్‌ అండ్‌ బి కార్యాలయంలో అటెండర్‌గా పనిచేస్తున్న మాచాపూర్‌కు చెందిన కోట్టిమచ్చ రామకిష్టయ్య (48) గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు.

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
తీవ్ర గాయాలపాలైన రామకిష్టయ్య

ఎల్లారెడ్డి, డిసెంబరు 18: ఎల్లారెడ్డి ఆర్‌ అండ్‌ బి కార్యాలయంలో అటెండర్‌గా పనిచేస్తున్న మాచాపూర్‌కు చెందిన కోట్టిమచ్చ రామకిష్టయ్య (48) గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. ఎల్లారెడ్డిలో విధులు ముగించుకున్న ఆయన మాచాపూర్‌కు వెళుతుండగా మాచాపూర్‌ శివారులో తన వాహనానికి అడ్డంగా వచ్చిన కుక్కలను తప్పించబోయి అదుపు తప్పి పడిపోవడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన ఈయనను చికిత్స నిమిత్తం ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం నిమిత్తం హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు. రామకిష్టయ్యకు భార్య, కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, కుమారుడు లక్ష్మీనారాయణ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read more