ప్రేమ వివాహం చేసుకుని వస్తుండగా కబలించిన మృత్యువు

ABN , First Publish Date - 2020-12-12T05:11:07+05:30 IST

వారిద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు.. ఒకరంటే ఒకరు ప్రాణంగా ప్రేమించుకున్నారు. కలిసి జీవించాలని.. బం గారు కలలుగన్నారు.. ఆ కలలను నెరవేర్చుకునేందుకు వివాహ బంధం తో ఒక్కటయ్యారు. కానీ వారి కలలు కళ్లలయ్యాయి.

ప్రేమ వివాహం చేసుకుని వస్తుండగా కబలించిన మృత్యువు
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సతీశ్‌, మహిమ సతీశ్‌, మహిమ (ఫైల్‌)

రోడ్డు ప్రమాదంలో ప్రేమ జంట దుర్మణం    
సదాశివనగర్‌ పోలీసు స్టేషన్‌కు వస్తుండగా ఘటన

సదాశివనగర్‌, డిసెంబరు 11: వారిద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు.. ఒకరంటే ఒకరు ప్రాణంగా ప్రేమించుకున్నారు. కలిసి జీవించాలని.. బం గారు కలలుగన్నారు.. ఆ కలలను నెరవేర్చుకునేందుకు వివాహ బంధం తో ఒక్కటయ్యారు. కానీ వారి కలలు కళ్లలయ్యాయి. ద్విచక్రవాహనంపై వస్తుండగా రెప్పపాటులో జరిగిన ప్రమాదం కాటికి మార్గం చూపాయి. ప్రేమ పెళ్లి చేసుకున్న రోజే నవజంట రోడ్డు ప్రమాదంలో దుర్మణం చెం దారు. ఈ విషాద సంఘటన కామారెడ్డి జిల్లా సదాశివనగర్‌ పోలీసు స్టేషన్‌ ఎదురుగా 44వ జాతీయ రహదారిపై గురువారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్సై నరేశ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. సదాశివనగర్‌ మం డలం మోడెగాం గ్రామానికి చెందిన బట్టు సతీశ్‌(24) తల్లిదండ్రులు లేరు. ఉపాధి నిమిత్తం కొన్నేళ్లుగా  హైదరాబాద్‌లో గండిమైసమ్మ ప్రాం తంలో ఉంటూ ఓ హోటల్‌లో పని చేస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన ఠాకూర్‌ మహిమ(22)తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. కొన్నాళ్లుగా ప్రేమించుకున్న వారు గురువారం హైద రాబాద్‌లో ప్రేమపెళ్లి చేసుకున్నారు. అనంతరం ద్విచక్రవాహనంపై హై దరాబాద్‌ నుంచి కామారెడ్డి మీదుగా సదాశివనగర్‌ పోలీసుస్టేషన్‌కు వ స్తున్నారు. కాగా సదాశివనగర్‌ జూనియర్‌ కళాశాల వద్ద యూటర్న్‌ తీసు కుని పోలీసుస్టేషన్‌ వైపు వస్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీ కొంది. దీంతో ఠాకూర్‌ మహిమ అక్కడికక్కడే మృతి చెందగా సతీష్‌ తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో సతీష్‌ను నిజామాబాద్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలి ంచగా చికిత్స పొందుతూ మరణించినట్లు వైద్యులు తెలి పారు. అతడి మృతదేహాన్ని కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మహిమ తల్లి నిర్మల ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Updated Date - 2020-12-12T05:11:07+05:30 IST