రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

ABN , First Publish Date - 2020-12-07T06:55:05+05:30 IST

మండలంలోని అడ్లూర్‌ ఎల్లారెడ్డి గ్రామ శివారులో గాయత్రి షుగర్‌ ఫ్యాక్టరీ వద్ద 44వ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో మొడెగాం గ్రామానికి చెందిన మచ్చర్ల స్వామి(34) అక్కడికక్కడే మృతి చెందాడు.

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
గుర్తు తెలియని వాహనం ఢీకొని మృతి చెందిన మచ్చర్ల స్వామి

సదాశివనగర్‌, డిసెంబరు 6 : మండలంలోని అడ్లూర్‌ ఎల్లారెడ్డి గ్రామ శివారులో గాయత్రి షుగర్‌ ఫ్యాక్టరీ వద్ద 44వ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో మొడెగాం గ్రామానికి చెందిన మచ్చర్ల స్వామి(34) అక్కడికక్కడే మృతి చెందాడు. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. మొడెగాం గ్రామానికి చెందిన మచ్చర్ల స్వామి గతకొంత కాలంగా కామారెడ్డి జిల్లా కేంద్రానికి ఉపాధి నిమిత్తం వెళ్లి జీవిస్తున్నాడు. భార్య కవిత మహిళా సంఘం సభ్యురాలిగా ఉంది. సంఘం డబ్బులు ఇచ్చేందుకు ఆదివారం రాత్రి తన ద్విచక్రవాహనంపై వస్తుండగా గాయత్రి షుగర్‌ ఫ్యాక్టరీ వద్ద వెనుక నుంచి గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో తలకు బలమైన గాయాలు తగిలి అక్కడికక్కడే మృతిచెందాడని తెలిపారు.

Updated Date - 2020-12-07T06:55:05+05:30 IST