త్రిలింగ రామేశ్వరాలయాన్ని పరిశీలించిన పరిశోధకుడు

ABN , First Publish Date - 2020-12-27T05:11:16+05:30 IST

మండలంలోని తాండూర్‌ గ్రామం లోని అతి పురాతనమైన త్రిలింగ రామేశ్వరాలయాన్ని తెలంగాణ రాష్ట్ర చారిత్రక పరిశోధకులు డాక్టర్‌ ద్యావణపల్లి సత్యనారాయణ స్థానిక జడ్పీటీసీ మనోహర్‌రెడ్డితో కలిసి శనివారం పరిశీలించారు.

త్రిలింగ రామేశ్వరాలయాన్ని పరిశీలించిన పరిశోధకుడు
త్రిలింగ రామేశ్వరాలయాన్ని పరిశీలిస్తున్న పరిశోధకుడు సత్యనారాయణ

నాగిరెడ్డిపేట, డిసెంబరు 26: మండలంలోని తాండూర్‌ గ్రామం లోని అతి పురాతనమైన త్రిలింగ రామేశ్వరాలయాన్ని తెలంగాణ రాష్ట్ర చారిత్రక పరిశోధకులు డాక్టర్‌ ద్యావణపల్లి సత్యనారాయణ స్థానిక జడ్పీటీసీ మనోహర్‌రెడ్డితో కలిసి శనివారం పరిశీలించారు. కాకతీయుల కాలంలో నిర్మాణమైన ఈ ఆలయాభివృద్ధి కోసం ఇటీవల పుణే దక్కన్‌ కళాశాలకు చెందిన ప్రొఫెసర్లు పరిశోధనలు జరిపారు. ఆలయ అభివృ ద్ధిలో భాగంగా డాక్టర్‌ దేవనపల్లి సత్యనారాయణ శనివారం ఆలయా న్ని సందర్శించి, ఆలయ ప్రాచీన కట్టడాలను, ఆలయ ప్రాంగణం, పరి సరాలను పరిశీలించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులతో, గ్రామ స్థులతో సమావేశం ఏర్పాటు చేసి ఆలయాభివృద్ధి గురించి చర్చించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ మనోహర్‌రెడ్డి, సర్పంచ్‌ గంగామణి సంగ య్య, తాండూర్‌ సొసైటీ చైర్మన్‌ గంగారెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు దత్తు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-27T05:11:16+05:30 IST