రుణమాఫీ నిధుల విడుదల

ABN , First Publish Date - 2020-05-08T08:35:45+05:30 IST

రాష్ట్ర ప్ర భుత్వం రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొ ని కరోనాలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ రుణమాఫీ నిధులను

రుణమాఫీ నిధుల విడుదల

రూ.25 వేలలోపు రుణాలు మాఫీ 

జిల్లాలో దాదాపు 14వేల మంది రైతులకు మాఫీ అయ్యే అవకాశం


కామారెడ్డి, మే7 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్ర భుత్వం రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొ ని కరోనాలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ రుణమాఫీ నిధులను విడుదల చేయడంపై అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రా ష్ట్ర ప్రభుత్వం గురువారం రూ.25వేల లోపు రైతుల రుణాలు మాఫీ చేస్తున్నట్లు ప్రకటిం చింది. ఎకకాలంలో మొత్తం రుణ మాఫీ కిం ద రూ.1200 కోట్ల నిధులను ప్రభుత్వం విడు దల చేసింది. రైతుల బ్యాంక్‌ ఖాతాల్లోనే రు ణమాఫీ జమకానుంది. అటు రాష్ట్రంలో వాన కాలం పంటకు రైతుబంధు మొత్తం నిధుల ను కూడా విడుదల చేసినట్లు తెలిసింది.


సీఎం కేసీఆర్‌ ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భా గంగా రైతుల రుణమాఫీ చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. రూ.25వేలలోపు రు ణాలు తీసుకున్న రైతులందరికీ ఒకే విడుత లో మాఫీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించ డంతో ఆ రైతుల వివరాలు సేకరించాలంటూ  సంబంధిత శాఖల ఉన్నతాధికారులు ఆదేశిం చారు. రెండు నెలల క్రితమే రుణమాఫీకి అ ర్హులుగా ఉన్న రైతుల వివరాలను జిల్లాల వారీగా వ్యవసాయ, బ్యాంక్‌ అధికారులు సేక రించారు. 2018 డిసెంబర్‌ 11లోపు రుణాలు తీసుకున్న రైతుల వివరాలను సేకరించారు.


ఇలా కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా అప్పటి వరకు లక్షా 50 వేల మంది రైతులు వంద కోట్లకు పైగానే పంట రుణాలు తీసుకున్నట్లు సంబంధిత శాఖాధికారులు పేర్కొంటున్నారు. ఈ కటాప్‌ డేట్‌ వరకు రూ.25వేల లోపు పం ట రుణాలు తీసుకున్న రైతుల జాబితాను జి ల్లా అధికారులు సిద్ధం చేసి ప్రభుత్వానికి ప పనున్నారు. కామారెడ్డి జిల్లాలో 14వేల మం దికిపైగా రైతులు రూ.25వేల వరకు పంట రుణాలను తీసుకున్నట్లు సంబంధిత శాఖాధి కారులు విన్నవిస్తున్నారు. రుణమాఫీకి రూ. 1200 కోట్ల నిధులను విడుదల చేయడంతో జిల్లాలో సుమారు 14వేల మంది రైతులకు పైగా రూ.4కోట్ల వరకు మాఫీ కానున్నాయి.

Updated Date - 2020-05-08T08:35:45+05:30 IST