రిజిస్ర్టేషన్‌ కష్టాలు

ABN , First Publish Date - 2020-12-17T05:39:48+05:30 IST

ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో క్రయవిక్రయదారులకు ఇప్పట్లో ‘రిజిస్ట్రేషన్‌’ కష్టాలు తీరేలా లేవు. ప్రభుత్వ నిబంధనల కారణంగా ప్లాట్‌లను కొనుగోలు చేసిన వందలాది మంది రిజిస్ట్రేషన్‌ల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది.

రిజిస్ర్టేషన్‌ కష్టాలు

ప్రభుత్వ నిబంధనలతో కొనుగోలుదారులకు తప్పని ‘రిజిస్ట్రేషన్‌’ కష్టాలు
వ్యవసాయేతర రిజిస్ట్రేషన్‌లు మొదలైనా పెరగని స్లాట్‌ల సంఖ్య
మూడు రోజుల్లో ఉమ్మడి జిల్లా పరిధిలో కేవలం 10 రిజిస్ట్రేషన్‌లే..
నిజామాబాద్‌, డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి):
ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో క్రయవిక్రయదారులకు ఇప్పట్లో ‘రిజిస్ట్రేషన్‌’ కష్టాలు తీరేలా లేవు. ప్రభుత్వ నిబంధనల కారణంగా ప్లాట్‌లను కొనుగోలు చేసిన వందలాది మంది రిజిస్ట్రేషన్‌ల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్‌లు మొదలైనా క్యూలు లేవు. రిజిస్ట్రేషన్‌ల సంఖ్య పెరగడం లేదు. కేవలం ఇళ్లకు మాత్రమే అను మతులు ఇచ్చి ప్లాట్ల రిజిస్ట్రేషన్‌లపై నిర్ణయం తీసుకోకపోవడ ం వల్ల ఫలితం లేదు. ఎక్కువ మంది స్లాట్‌లు బుక్‌ చేసుకోకపోవడం వల్ల నామమాత్రంగానే రిజిస్ట్రేషన్‌లు కొనసాగుతున్నాయి. ప్రభుత్వం ప్లాట్లపై నిర్ణయం ప్రకటించి అనుమతులు ఇవ్వగానే రిజిస్ట్రేషన్‌లు చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలో రిజిస్ట్రేషన్‌లు మొదలై మూడు రోజులై నా ఇప్పటి వరకు మాత్రం జోరుగా సాగడం లేదు. ప్రతీరోజు ఉమ్మడి జిల్లా పరిధిలో ఎక్కువగా స్లాట్‌ల బుకింగ్‌ జరగడం లేదు. తెలంగాణ రిజిస్ట్రేషన్‌ పేరుమీద వ్యవసాయేతర ఆస్తుల కు అనుతులు ఇచ్చిన ప్రభుత్వం వెబ్‌సైట్‌లో ప్లాట్లకు మాత్రం ఇవ్వలేదు. కేవలం ఇళ్లను కొనుగోలు చేసిన వారికే రిజిస్ట్రేషన్‌ లు చేసుకునేందుకు అవకాశం ఇచ్చారు. పాత రిజిస్ట్రేషన్‌ విధానంలోనే కొనసాగిస్తామని చెప్పినా వెబ్‌సైట్‌లో మాత్రం ఇళ్లకు మాత్రమే రిజిస్ట్రేషన్‌లు చేస్తున్నారు. పాత పద్ధతిలో  చేయకపోవడం వల్ల  ఖాళీ  ప్లాట్లను కొన్నవారు రిజిస్ట్రేషన్‌ చేసుకునేందుకు అవకాశం లేకుండా పోయింది. ప్రభుత్వం కొద్ది రోజు ల్లో ఆప్షన్‌ ఇస్తామని చెప్పినా ఇప్పటి వరకు సరిచేయలేదు. ఉమ్మడి జిల్లా పరిధిలో రెండు రోజుల్లో 10 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో కేవలం పది మాత్రమే రిజిస్ట్రేషన్‌లు జరిగా యి. వీటిలో ఇళ్లను మాత్రమే రిజిస్ట్రేషన్‌లు చేశారు. కొత్త రిజిస్ట్రేషన్‌ విధానం అమల్లోకి రావడం అన్ని  మీ సేవ ద్వారానే అప్‌లోడ్‌ చేయడం స్లాట్‌ బుక్‌ చేసుకోవడంతో పాటు చెల్లింపులన్నీ అక్కడే చేయవలసి ఉండడంతో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఆస్తులు అమ్మే వారి వివరాలతో పాటు కొన్న వారి వివరాలు కూడా మీ సేవ ద్వారానే నమోదు చేస్తున్నారు. కొత్త గా పీ టిన్‌ పేరున వివరాలు అడుగుతుండడంతో అవి మున్సిపాలిటీ, ఇతర గ్రామ పంచాయతీల నుంచి తీసుకరావడంలో జాప్యం అవుతోంది. పాత విధానంలో డాక్యుమెంట్‌లను తీసుకవచ్చి రిజిస్ట్రేషన్‌లు చేయించుకునే వారు. ప్రస్తుతం ఆ అవ కాశం లేదు. ధరణి లాగానే అమ్మేవారితో పాటు కొనేవారి  వివరాలు, ఆధార్‌నెంబర్‌ నమోదు చేయగానే డాక్యుమెంట్‌ కూడా ఆన్‌లైన్‌లోనే జనరేట్‌ అవుతోంది.  రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన స్టాంప్‌ డ్యూటీ, రిజిస్ట్రేషన్‌ ఫీజు, మ్యూటేషన్‌ ఫీజులు ఆన్‌లైన్‌లోనే చెల్లించిన తర్వాత స్లాట్‌ బుకింగ్‌ సమయం వస్తోంది. దానికి అనుగుణంగా స్లాట్‌ బుక్‌ చేసుకున్న తేదీల్లో ఈ రిజిస్ట్రేషన్‌లను చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో ఎక్కువగా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం ప్లాట్ల ద్వారానే జరుగుతోంది. స్టాంప్స్‌ అండ్‌ రిజర్వేషన్‌ శాఖకు కూడా ప్లాట్ల రిజిస్ట్రేషన్‌ల ద్వారానే ఆదా యం వస్తోంది. ఓపెన్‌ ప్లాట్ల ద్వారా ప్రతినెల ఈ రెవెన్యూ పెరుగుతోంది. ప్రస్తుతం వెబ్‌సైట్‌లో ఓపెన్‌ ప్లాట్లకు సంబంధించిన రిజిస్ట్రేషన్‌ ఆప్షన్‌  ఇవ్వలేదు. నిజామాబాద్‌, కామారెడ్డి, బోధన్‌, ఆర్మూర్‌ మున్సిపాలిటీల పరిధిలో ఎక్కువగా ఇవే అమ్మకాలు జరుగుతున్నాయి. జిల్లాలో ఆయా మండలాల పరిధిలోనే కూడా ఓపెన్‌ ప్లాట్లనే కొనుగోలు చేశారు. గడిచిన మూ డు నెలలుగా రిజిస్ట్రేషన్‌లు నిలిచిపోవడం వల్ల కొన్న వారికి కూడా కాలేదు. వారంతా రిజిస్ట్రేషన్‌లు చేసుకునేందుకు ఎదు రు చూస్తున్నారు. ప్రభుత్వం వ్యవసాయేతర ఆస్తులకు అవకా శం ఇచ్చినా ఓపెన్‌ ప్లాట్లకు ఇవ్వకపోవడం వల్ల ఆందోళన చెందుతున్నారు. లక్షల రూపాయలు ప్లాట్ల కొనుగోలుకు ఖర్చు పెట్టినందున అవకాశం ఇవ్వగానే చేయించుకునేందుకు సిద్ధమవుతున్నారు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు మాత్రం పాత పద్ధతిలోనే డాక్యుమెంట్ల ద్వారా చేయాలని ఉమ్మడి జిల్లా పరిధిలో ధర్నాలు కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం వెబ్‌సైట్‌లో ఆప్ష న్‌ పొందుపరిస్తే రిజిస్ట్రేషన్‌లు ఎక్కువ గా కానున్నాయి. ఉమ్మడి జిల్లా పరిఽధిలో మూడు రోజుల్లో కేవల ం పది రిజిస్ట్రేషన్‌లు మాత్రమే నమోదయ్యాయి. మూడో రోజు బుధవారం ఆర్మూర్‌లో రెండు, కామారెడ్డి ఒకటి, ఎల్లారెడ్డి ఒకటి, దోమకొండ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఒకటి రిజిస్ట్రేషన్‌లు అయ్యా యి. ఇళ్ల కొనుగోళ్లు తక్కువగా ఉండడ ం వెబ్‌సైట్‌లో వివరాలు ఎక్కువగా అడు గుతుండడంతో ఈ రిజిస్ట్రేషన్‌లు ఎక్కువ కావడం లేదు. ఒకటి, రెండు రోజుల్లో ఖాళీ ప్లాట్లపైన ప్రభుత్వ నిర్ణయం రావడంతో పాటు వెబ్‌సైట్‌లో ఆప్షన్‌లు ఇస్తారని స్టాంప్స్‌ అండ్‌  రిజిస్ట్రేషన్‌ శాఖ  అధికారులు తెలిపారు. అవ కాశం ఇచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్‌లు పెరుగుతాయని తెలిపారు. మరో వారం రోజుల్లో రిజిస్ట్రేషన్‌ల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.

Updated Date - 2020-12-17T05:39:48+05:30 IST