ఆగని సాగు
ABN , First Publish Date - 2020-11-03T10:36:41+05:30 IST
నిజామాబాద్ జిల్లాలో ఎర్రజొన్న సాగు చేస్తున్న రైతుల కు ప్రతీయేటా పంటను విక్రయించే సమయంలో కష్టాలు ఏర్పడుతున్నా.. సాగును మాత్రం వదలడం లేదు
నిజామాబాద్ జిల్లాలో మొదలైన ఎర్రజొన్న సాగు
ప్రభుత్వం వద్దన్నా సాగుచేస్తున్న రైతులు
మొక్కజొన్నకు బదులుగా ఎర్రజొన్నకు మళ్లిన రైతులు
ఈ యాసంగిలో భారీగా పెరుగుతున్న ఎర్రజొన్న సాగు
ప్రతియేడు అమ్మే సమయంలో రైతులకు తప్పని తిప్పలు
నిజామాబాద్ (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) నవంబరు 2:
నిజామాబాద్ జిల్లాలో ఎర్రజొన్న సాగు చేస్తున్న రైతుల కు ప్రతీయేటా పంటను విక్రయించే సమయంలో కష్టాలు ఏర్పడుతున్నా.. సాగును మాత్రం వదలడం లేదు. ఈ యే డు కూడా మొక్కజొన్నకు బదులుగా ఎర్రజొన్నను భారీగా సాగు చేస్తున్నారు. డీలర్‌లతో మొదటనే ఒప్పందం చేసుకు ంటూ పంటను మొదలుపెట్టారు. మొక్కజొన్నకు ధర తగ్గడం.. కొనేవారు లేకపోవడంతో ఎక్కువ మంది రైతులు ఈ యాసంగిలో ఎర్రజొన్న వైపు మళ్లారు. ప్రభుత్వం డీలర్‌ల ను కట్టడి చేసినా సాగు మాత్రం ఆగడం లేదు. గడిచిన వా రం రోజుల నుంచి పంట సాగును మొదలుపెట్టారు. అమ్మే సమయంలో కొంత ఇబ్బందులు వచ్చినా పంటకు పెట్టుబ డి తక్కువ కావడంతో ఎక్కువ మంది రైతులు ఎర్రజొన్న సాగు వైపు మొగ్గుచూపి పంట వేస్తున్నారు. ప్రభుత్వం ఎర్ర జొన్న కొనుగోలుకు చేతులు ఎత్తివేయడంతో రైతులు తప్ప నిసరి పరిస్థితులలో కంపెనీ డీలర్లు, వ్యాపారులతో ఒప్పం దాలు చేసుకుంటున్నారు.
30 ఏళ్లుగా కొనసాగుతున్న సాగు
నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ డివిజన్ పరిధిలో గత 30 సంవత్సరాలుగా రైతులు ఎర్రజొన్నను సాగు చేస్తున్నా రు. జిల్లాలోని 18 మండలాల పరిధిలో 184 గ్రామాలలో ఈ యాసంగిలో 40 వేల ఎకరాల నుంచి 50 వేల ఎకరాల మ ధ్య పంటను సాగు చేస్తారు. ప్రతీ సంవత్సరం అక్టోబరు, నవంబరు నెలల్లో ఈ పంటను వేస్తా రు. పెట్టుబడి తక్కువగా ఉండి ది గుబడి ఎక్కువగా వచ్చే ఈ పంటను ధరలో హెచ్చుతగ్గు లు ఉన్నా రైతులు మాత్రం సాగును మానడం లేదు. ప్రతీ సంవత్సరం ఈ పం టను వేస్తున్నారు. జిల్లాతో పాటు పక్కనే ఉన్న జగిత్యా ల, నిర్మల్ జిల్లాల్లోనూ నాలు గైదేళ్లుగా ఈ పంట వేస్తున్నా రు. కర్ణాటకలోని రాయచూర్ ప్రాంతంలో కూడా ఈ పంట సాగ వుతోంది. రెడ్ జవార్‌గా పిలిచే ఈ ఎర్ర జొన్నను ఉత్తరాది రాష్ట్రాలు అయిన ఢిల్లీ, హ ర్యానా, ఉత్తరప్రదేశ్, గుజరాత్‌తో పాటు ఇతర రాష్ట్రాలలో ప శుగ్రాసం కోసం వినియోగిస్తారు. అక్కడి రైతుల వినియో గం కోసం ఇక్కడి రైతులు పంటను పండిస్తున్నారు.
గడిచిన పదేళ్లుగా రైతుల ఆందోళన
జిల్లాలో మొదట ఎర్రజొన్న పంటను సాగు చేసినప్పుడు ధరలు బాగా రావడం, ఉత్తరాది నుంచి వ్యాపారులు ఇక్కడ కు వచ్చి కొనుగోలు చేయడంతో ఇబ్బందులు తలెత్తలేదు. గ డిచిన పదేళ్లుగా ఈ పంటను వేసిన రైతులు ఆందోళనలు చేస్తే తప్ప కొనుగోలు జరగడం లేదు. సాగు విస్తీర్ణం పెరగ డం, ఎర్రజొన్న అమ్మకాలలో లాభాలు ఉండడంతో స్థానిక వ్యాపారులు ప్రవేశించడంతో రైతులకు సమస్యలు తలెత్తాయి. ఉత్తరాది వ్యాపారులు రావ డం తగ్గి ఇక్కడి వ్యాపారులు కొనుగో లు చేసి డబ్బులు ఇవ్వకపోవడం తో 11 ఏళ్ల క్రితం ఎర్రజొన్న రై తుల ఆందోళనలో కాల్పులు జరిగాయి. ప్రతీ సంవత్స రం పంట వేసినప్పుడు వ్యాపారులు, రైతులు చే సుకున్న ఒప్పందం ప్రకా రం పంట చేతికి వచ్చిన సమయంలో ధరలు పెట్టక పోవడంతో ఈ అందోళనలు జరుగుతున్నాయి. పంట వచ్చి న తర్వాత ధరలు తగ్గించడం, డ బ్బులు సకాలంలో ఇవ్వక పోవడం వ ల్ల రైతులు ఇబ్బందులు పడి తప్పనిసరి పరి స్థితుల్లో ఆందోళనలు చేస్తున్నారు. వ్యాపారులు కొనుగోలు చేసిన తర్వాత నెలల తరబడి రైతులకు డబ్బులు చెల్లించని సంఘటనలు ఉన్నాయి. ఎర్రజొన్న కొనుగోళ్లలో వ్యాపారుల మాయాజాలం ఎక్కువగా ఉండడంతో రైతులు ప్రభుత్వమే కొనుగోలు చేయాలని గత కొన్నేళ్లుగా కోరుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రెండు దఫాలు 2017, 18 సంవత్సరాలలో ఎర్రజొ న్నలను కొనుగోలు చేసింది. గడిచిన రెండు సంవత్సరాలుగా కొనడం లేదు. ఎర్రజొన్నల సాగు ప్రతీ సంవత్సరం పెరగ డం, ఆహారపంట కాకపోవడంతో ప్రభుత్వం కూడా రెండేళ్లు గా ఎర్రజొన్నలను కొనుగోలు చేయడం లేదు.
అప్రమత్తమైన వ్యవసాయ శాఖ అధికారులు
జిల్లాలో ఎర్రజొన్న సాగు భారీగా పెరుగుతుండడంతో వ్యవసాయ శాఖ అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ప్రభుత్వానికి ఇప్పటికే ఈ పంట సాగుపైన నివేదించారు. జిల్లాలోని మొత్తం 32 మంది లైసెన్సుడ్ డీలర్లతో వ్యవసా య శాఖ అధికారులు గత నెల మొదటి వారంలోనే సమా వేశం నిర్వహించారు. పంటను తప్పకుండా కొనుగోలు చే స్తామని ఒప్పందం చేసుకుంటేనే రైతులకు విత్తనాలు ఇవ్వా లని సమావేశంలో సూచించారు. డీలర్లు మధ్యలో ఆర్గనైజర్ల ను పెట్టుకుని విత్తనాలు ఇవ్వడం, మళ్లీ కొనుగోలు చేయక పోతే లైసెన్సులను రద్దు చేస్తామని హెచ్చరించారు. ఎర్రజొ న్న సాగు చేస్తున్న గ్రామాలలోని రైతులతో వ్యవసాయ, రె వెన్యూ, పోలీసు అధికారులతో కలిసి సమావేశాలను నిర్వ హించారు. బైబ్యాక్ ఒప్పందం చేసుకున్న తర్వాతనే రైతులు పంటను సాగు చేయాలని కోరారు. జిల్లా వ్యవసాయ అధి కారుల సూచనల మేరకు ఒప్పందాలు పూర్తిచేసుకున్న రై తులు ఈ సాగును మొదలుపెట్టారు. భారీగా విస్తీర్ణం పెరి గే అవకాశం ఉండడంతో అధికారులు ముందస్తుగా ప్రభుత్వానికి నివేదించారు. రైతులకు, డీలర్ల మధ్య జరిగిన ఒప్ప ందం వివరాలను పంపించారు. జిల్లాలో మొక్కజొన్న తగ్గ డం వల్ల ఎర్రజొన్న సాగు భారీగా పెరుగుతోందని జేడీఏ గోవింద్ తెలిపారు. డీలర్‌లు, రైతులు ఒప్పందం చేసుకొని ఎర్రజొన్నను సాగు చేస్తున్నారని ఆయన తెలిపారు.
యాసంగిలో భారీగా పంట
జిల్లాలో ఈ యాసంగిలో కూడా రైతులు ఎర్రజొన్నను భారీగా సాగు చేస్తున్నారు. మొక్కజొన్నకు బదులు ఈ పంటను వేస్తున్నారు. ఈ సంవత్సరం మొక్కజొన్న వేసే రైతులు కూడా ఈ యాసంగిలో ఎర్రజొన్నకు మళ్లారు. వా నాకాలంలో మొక్కజొన్న వేసిన రైతులకు భారీగా నష్టం రావడంతో ఎర్రజొన్న వైపు చూస్తున్నారు. వానాకాలంలో వేసిన మొక్కజొన్నను ప్రభుత్వం ఆలస్యంగా కొనుగోలు చేయడం వల్ల రైతులు ముందే అమ్ముకోవడం వల్ల భారీగా నష్టపోయారు. యాసంగిలో కూడా కొనే అవకాశం లేకపోవడంతో జిల్లాలో వరి వేయని మెజారిటీ రైతులు ఎర్రజొన్న వైపు మొగ్గుచూపి ఆ పంటను వేస్తున్నారు. నెల రోజులుగా విత్తన డీలర్‌లతో ఒప్పందం చేసుకున్న రైతులు పంట సాగు మొదలుపెట్టారు. మొదట వ్యవసాయ శాఖ అధికారులు ఎర్రజొన్న పంటను తగ్గించేందుకు డీలర్‌లను కట్టడి చేస్తూ రైతులకు అవగాహన కల్పించినా.. ఎక్కువ మంది ఎర్రజొన్న వైపే మొగ్గు చూపారు. డీలర్‌లతో ఒప్పందం చేసుకొని ఈ పంటను వేస్తున్నారు.
జిల్లాలో ఈ యాసంగిలో 35 వేల ఎకరాల వరకు ఎర్రజొన్న సాగవుతుందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేసినప్ప టికీ మొక్కజొన్న వల్ల వచ్చిన నష్టం వల్ల 50 వేల ఎకరాలకుపైగా సాగవుతుందని అంచనా వేస్తున్నారు. రైతులు మాత్రం నిబంధనలు కఠినతరం చేసినా పంటను మాత్రం మానడం లేదు. ముందే క్వింటాలు రూ.2వేల నుంచి రూ. 2,400 మధ్య ఒప్పందం చేసుకొని పంట వేస్తున్నారు. డీలర్‌లు రైతుల మధ్య ఈ ఒప్పందం జరగడంతో అధికారులు కూడా సాగుపైన అంచనా వేస్తున్నారు. ప్రతీ సంవత్సరం అమ్మే సమయంలో గొడవ జరుగుతుండడంతో ఒప్పందా లు పకడ్బందీగా అయ్యే విధంగా చూస్తున్నారు. ఇప్పటికే గడిచిన వారం రోజులు రైతులు పంట సాగులో నిమగ్నమయ్యారు. అన్ని మండలాల పరిధిలో ఎర్రజొన్న సాగు ను మొదలుపెట్టారు. జిల్లాలో రైతులు అక్టోబరు చివరి వా రం నుంచి నవంబరు రెండో వారం వరకు ఈ పంటను వేస్తున్నారు. గత సంవత్సరం లాగానే ముందుగానే పంటసాగును మొదలుపెట్టారు