లాక్‌తో లాస్‌

ABN , First Publish Date - 2020-05-09T11:20:29+05:30 IST

కరోనా ప్రభావంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌ డౌన్‌ విధించడం వల్ల ప్రభుత్వ శాఖల ఆదాయానికి భారీగా

లాక్‌తో లాస్‌

లాక్‌డౌన్‌తో ప్రభుత్వ శాఖల ఆదాయానికి గండి


నిజామాబాద్‌, మే 8 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి):  కరోనా ప్రభావంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌ డౌన్‌ విధించడం వల్ల ప్రభుత్వ శాఖల ఆదాయానికి భారీగా గండి పడింది. నెలన్నర రోజుల్లో కోట్ల రూపా యలలో ఆదాయానికి దెబ్బ పడింది. ప్రతీరోజు ప్రభు త్వానికి స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌, ఎక్సైజ్‌, రవాణా, వాణిజ్యపన్నుల ద్వారా ఎక్కువగా ఆదాయం వస్తుంది. వీటితో పాటు ఇతర శాఖలైన మైనింగ్‌, మున్సిపల్‌ శాఖల ద్వారా కూడా ఆదాయం ప్రతినెల ప్రభుత్వానికి వస్తుంది. మిగతా శాఖల ద్వారా కొంత మొత్తం ఆదా యం ఉంటుంది. గడిచిన 45 రోజుల్లో వీటన్నింటికి నామమాత్రం ఆదాయాలు వచ్చాయి.


స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ శాఖలో..

ఉమ్మడి జిల్లా పరిధిలో స్టాంప్స్‌ అండ్‌ రిజి స్ట్రేషన్‌కు ప్రతినెలా రూ.8కోట్ల నుంచి 10 కోట్ల ఆదా యం వచ్చేది. రిజిస్ట్రేషన్‌ అయ్యే డాక్యు మెంట్‌ల ఆధా రంగా ఉమ్మడి జిల్లా పరిధిలోని 10 సబ్‌ రిజిస్ట్రార్‌ కా ర్యాలయాల ద్వారా ఈ ఆదాయం సమకూరేది. లాక్‌ డౌన్‌ సందర్భంగా ఏప్రిల్‌ నెలలో కేవలం రూ.కోటి వర కే ఆదాయం ఈ శాఖకు వచ్చింది. 45 రోజుల్లో సు మారు 15 కోట్ల వరకు ఆదాయం తగ్గిపోయింది. కరోనా నేపథ్యంలో ప్రతీ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాల యంలో ప్రతీరోజు 30 వరకు డాక్యుమెంట్‌లు చేయాలని ఆదేశాలు ఇచ్చారు. నిబంధనలు సడలించ డం వల్ల ఈ నెలలో కొంత మొత్తం పెరుగుతుందని అధికారులుల భావిస్తున్నారు. 


ఎక్సైజ్‌ శాఖలో..

ఉమ్మడి జిల్లా పరిధిలో ఎక్సైజ్‌ శాఖ ద్వారా మద్యం షాపులు, బార్లలో రూ.వంద కోట్ల వరకు మద్యం అ మ్మకాలు జరిగేవి. ట్యాక్స్‌ రూపేణ ప్రభుత్వానికి ప్రతి నెలా రూ.30 కోట్ల వరకు ఉమ్మడి జిల్లా పరిధిలో ఆదా యం వచ్చేది. 45 రోజులు వైన్స్‌ షాపులు మూసి ఉం డడం వల్ల భారీగా నష్టం జరిగింది. ప్రభుత్వానికి సు మారు రూ.45 కోట్ల ఆదాయం కరోనా ప్రభావంతో లాక్‌డౌన్‌ వల్ల రాకుండా పోయింది. 


ఆర్టీసీలో..

వేసవిలో ఆర్టీసీకి ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉం డేది. సీట్ల ఆక్యుపెన్సీ కూడా మార్చి, ఏప్రిల్‌, మే నెల ల్లో ఎక్కువగా వచ్చేది. లాక్‌డౌన్‌ వల్ల బస్సు సర్వీసుల ను రద్దుచేయడంతో ఆర్టీసీకి భారీ నష్టం వాటిల్లుతోం ది. ప్రతీరోజు కోటి రూపాయల వరకు ఆదాయం వచ్చే ఈ ఆర్టీసీకి ఉమ్మడి జిల్లా పరిధిలో లాక్‌డౌన్‌ కారణం గా రోజుకు కోటి చొప్పున రూ.45 కోట్ల వరకు నష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు. 


మిగతా శాఖలకూ భారీ నష్టం..

ఉమ్మడి జిల్లా పరిఽధిలో మిగ తా శాఖలకు కూడా భారీగా నష్టం నమోదైంది. విద్యుత్‌ శాఖకు నిజామాబాద్‌ జి ల్లాలో ప్రతినెలా రూ.57 కోట్లు, కామారెడ్డి పరిధిలో సుమారు రూ.45 కోట్ల వ రకు వసూలయ్యేవి. ఏప్రిల్‌ నెలలో కేవలం రూ.20 కోట్లు మాత్రమే నిజామాబాద్‌ జిల్లా లో వసూలయింది. కామారెడ్డి జి ల్లా పరిధిలో విద్యుత్‌ బకాయిల వ సూళ్లు అంతకంటే తక్కువగా ఉంది. రవా ణా శాఖకు ఉమ్మడి జిల్లా పరిధిలో ప్రతినెలా భారీగా ఆదాయం వచ్చేది. ఈ ఏప్రిల్‌ నెలలో మాత్రం గణనీ యంగా తగ్గిపోయింది. లాక్‌డౌన్‌ వల్ల ఆటోమొబైల్‌ షాపులు మూతపడడంతో రిజిస్ట్రేషన్‌లు తగ్గిపోయి ఆ దాయం భారీగా పడిపోయింది. వాహనాల అమ్మకాలు జరగకపోవడం వల్ల ఈ శాఖకు కూడా ఆదాయం ప డిపోయింది. ప్రస్తుతం అవకాశం ఇవ్వడం వల్ల ఈనెల పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు.


వాణిజ్య పన్నుల శాఖకు కూడా ఆదాయం గణనీయంగా పడిపోయింది. షా పులు మూతపడడం, వాణిజ్య వ్యాపార లావాదేవీలు జర గకపోవడం వల్ల జీఎస్టీ త గ్గిపోయింది. ఉమ్మడి జి ల్లా పరిధిలో సుమారు రూ.40 కోట్ల నుంచి రూ. 50కోట్ల వరకు ఈ ఆదా యం తగ్గిపోయినట్లు అధి కార వర్గాల సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. రైస్‌మిల్లులు, ఫుడ్‌ ఇండస్ట్రీలు, నిత్యావసర వస్తు వుల దుకాణాలు ఉండడం వల్ల కొంత  మొత్తంలో జీఎస్టీ వసూలైనట్లు అధికారులు తెలి పారు. మున్సిపల్‌ శాఖ పరిధిలోని మున్సిపాలిటీల్లో కూడా పన్నుల వసూళ్లు భారీగా తగ్గిపోయింది. అయి తే, ప్రస్తుతం ప్రభుత్వం ఈ నెలాఖరు వరకు అవకా శం ఇవ్వడం వల్ల పన్నులు వసూలవుతాయని ఆ శాఖ అధికారులు భావిస్తున్నారు. మొత్తంగా లాక్‌డౌన్‌ వల్ల 45 రోజులు పన్నుల వసూళ్లు మాత్రం భారీగా నిలిచిపోయాయి. ప్రభుత్వానికి గణనీయంగా ఆదా యం తగ్గిపోయింది. 

Updated Date - 2020-05-09T11:20:29+05:30 IST