ఎల్‌ఆర్‌ఎస్ రద్దుపై రియల్ ఎస్టేట్ వ్యాపారుల సంబరాలు
ABN , First Publish Date - 2020-12-31T04:54:45+05:30 IST
ఎల్‌ఆర్‌ఎస్ రద్దును హర్షిస్తూ బుధవారం రియల్‌ఎస్టేట్ వ్యాపారులు, డాక్యుమెంట్ రైటర్‌లు జిల్లా కేంద్రంలోని రిజిస్ట్రేషన్ కార్యాలయం వద్ద స్వీట్లు పంచుకొని సంబరాలు చేసుకున్నారు.
నిజామాబాద్ అర్బన్, డిసెంబరు 30: ఎల్‌ఆర్‌ఎస్ రద్దును హర్షిస్తూ బుధవారం రియల్‌ఎస్టేట్ వ్యాపారులు, డాక్యుమెంట్ రైటర్‌లు జిల్లా కేంద్రంలోని రిజిస్ట్రేషన్ కార్యాలయం వద్ద స్వీట్లు పంచుకొని సంబరాలు చేసుకున్నారు. రియల్ ఎస్టేట్ అసోసియేషన్ అధ్యక్షుడు జియా హైమద్, సీపీఎం నాయకుడు గోవర్ధన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వీట్ల పంచుకొని బాణాసంచా పేల్చారు. ఎల్‌ఆర్‌ఎస్ రద్దు ప్రజా పోరాటానికి దక్కిన విజయమని, ప్రభుత్వం ప్రజలపై ఆర్థిక భారాన్ని మోపాలని చూసిందని వాటిని తిరిగి చెల్లించాలన్నారు. ప్రజాపోరాటానికి ఎంతటి నియంతలైనా తలవొగ్గక తప్పదని దానికి ఇదే నిదర్శనమన్నారు. కార్యక్రమంలో అజర్, మసూద్, రియాజ్ హైమద్, ముజీబ్, రాములు, మారుతి తదితరులు పాల్గొన్నారు.