మొక్కజొన్నలు కొనుగోలు చేయాలని ధర్నా

ABN , First Publish Date - 2020-12-16T05:08:20+05:30 IST

రైతులు పండించిన మొక్కజొన్నలు కొనుగోలు చేయాలని, కనీస మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్‌ చేస్తూ బీజేపీ నాయ కులు, రైతులతో కలిసి గాంధారి మండల కేంద్రంలోని కామారెడ్డి, బాన్సువాడ ప్రధాన రహదారిపై మంగళ వారం రాస్తారోకో నిర్వహించారు.

మొక్కజొన్నలు కొనుగోలు చేయాలని ధర్నా
గాంధారిలో ధర్నా చేస్తున్న బీజేపీ నాయకులు

గాంధారి, డిసెంబరు 15: రైతులు పండించిన మొక్కజొన్నలు కొనుగోలు చేయాలని, కనీస మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్‌ చేస్తూ బీజేపీ నాయ కులు, రైతులతో కలిసి గాంధారి మండల కేంద్రంలోని కామారెడ్డి, బాన్సువాడ ప్రధాన రహదారిపై మంగళ వారం రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ రైతులు పండించిన పంటలను కొనుగోలు చేస్తామని చెప్పి రైతులతో చెలగాటం ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని రైతులు కష్టాలు ప్రభుత్వానికి పట్టడం లేదని అన్నా రు. మొక్కజొన్నలు కొనుగోలు చేయకుంటే పెద్ద ఎత్తు న్న నిరసన కార్యక్రమాలు చేపడుతామని అన్నారు. దాదాపు మూడు గంటల పాటు రాస్తారోకో నిర్వహిం చడంతో రెండు కిలోమీటర్లమేర వాహనాలు నిలిచిపో యాయి. ధర్నా విషయం తెలుసుకున్న ఎస్‌ఐ శ్రీకాంత్‌ అక్కడికి చేరు కుని ధర్నాను విరమింపజేశారు. కార్యక్రమంలో బీజేపీ మం డలా ధ్యక్షుడు సాయిబాబా, గిరిజన మోర్చా జిల్లా నాయకులు మోజీ రాం నాయక్‌, కిషన్‌రావు, మధుసూదన్‌రావు తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2020-12-16T05:08:20+05:30 IST