ధాన్యం కొనుగోలు చేయాలని రైతుల రాస్తారోకో

ABN , First Publish Date - 2020-10-31T06:32:35+05:30 IST

చన్ని పట్టకుండా ధాన్యాన్ని కొనుగోలు చేపట్టాలని కోరుతూ శుక్ర వారం నవీపేటలో రైతులు రాస్తారోకో నిర్వహిం చారు. ఒక శాతం కంటే తాలు ఎక్కువగా ఉన్న ధాన్యాన్ని చన్ని పట్టాలనే నిబంధనల పేరుతో అధికారులు ధాన్యాన్ని

ధాన్యం కొనుగోలు చేయాలని రైతుల రాస్తారోకో

నవీపేట, అక్టోబరు 30 : చన్ని పట్టకుండా ధాన్యాన్ని కొనుగోలు చేపట్టాలని కోరుతూ శుక్ర వారం నవీపేటలో రైతులు రాస్తారోకో నిర్వహిం చారు. ఒక శాతం కంటే తాలు ఎక్కువగా ఉన్న ధాన్యాన్ని చన్ని పట్టాలనే నిబంధనల పేరుతో అధికారులు ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదని రైతులు ఆరోపించారు. వరికోతలు చే పట్టి 15 రోజులు గడుస్తున్న నవీపేట సొసైటీ ఆధ్వర్యంలో ధాన్యాన్ని సక్రమంగా కొనుగోలు చేయడం లేదని పేర్కొన్నారు. అలాగే సన్నరకం ధాన్యానికి క్విం టాలుకు రెండువేల రూపాయల మద్దతు ధర చెల్లించాలని డి మాండ్‌ చేశారు. నవీపేట ప్రధాన రహదారిపై అరగంట పాటు రాస్తారోకో చేపట ్టడంతో రోడ్డుకు ఇరువైపులా పెద్ద ఎత్తున వాహ నాలు నిలిచిపోయాయి.


అనంతరం రైతులు మం డల రెవెన్యూ కార్యాలయానికి తరలివెళ్లి కార్యాల యం ఎదుట బైఠాయించారు. ఈ సందర్భంగా త హసీల్దార్‌ లత రైతులతో మాట్లాడుతూ నాణ్యమె ౖన ధాన్యానికి చన్ని పట్టే అవసరం లేదని కొను గోలు కేంద్రానికి తీసుకువచ్చే ధాన్యంతో ఎటువం టి తాలు లేకుండా చూసుకోవాలని రైతులకు సూచించారు. రైతులతో జరిగిన సమావేశంలో నవీపేట సొసైటీ చైర్మన్‌ అబ్బన్న, ఏవో సురేష్‌ గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-10-31T06:32:35+05:30 IST