రైతుల పోరాటానికి మద్దతుగా రాస్తారోకో

ABN , First Publish Date - 2020-12-04T04:37:28+05:30 IST

ఢిల్లీలో రైతులు చేస్తున్న పోరాటానికి మద్దతుగా ఐఎఫ్‌టీయూ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు.

రైతుల పోరాటానికి మద్దతుగా రాస్తారోకో
నిజామాబాద్‌లో రాస్తారోకో చేస్తున్న ప్రజాసంఘాల నాయకులు

నిజామాబాద్‌ అర్బన్‌, డిసెంబరు 3: ఢిల్లీలో రైతులు చేస్తున్న పోరాటానికి మద్దతుగా ఐఎఫ్‌టీయూ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ సి.నారాయణరెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఐఎఫ్‌టీయూ జిల్లా అధ్యక్షుడు ముత్తెన్న మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం తెచ్చిన వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ ఢిల్లీలో రైతాంగం చేస్తున్న పోరాటానికి ఐఎఫ్‌టీయూ సంపూర్ణ మద్దతు తెలుపుతుందన్నారు. దేశానికి అన్నం పెట్టే రైతన్నకు కన్నీరు పెట్టే విధంగా కేంద్రం ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. రైతులు చేస్తున్న ఉద్యమానికి  కార్మిక వర్గం అండగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో నాయకులు రాజేశ్వర్‌, వెంకన్న, మల్లేష్‌, సుధాకర్‌, రమేష్‌, విఠల్‌ తదితరులు పాల్గొన్నారు. 

రైతులు ప్రాణాలు కోల్పోతున్నా స్పందించకపోవడం సిగ్గుచేటు

పెద్దబజార్‌: రైతులు ప్రాణాలు కోల్పోతున్న స్పందించకపోవడం సిగ్గుచేటని ప్రజాసంఘాల కార్మిక నాయకులు విమర్శించారు. గురువారం జిల్లా కేంద్రంలోని బస్టాండ్‌ ఎదురుగా రాస్తారోకో  చేస్తున్న ప్రజాసంఘాల నాయకులను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా దేశ రాజధానిలో చేస్తున్న రైతాంగానికి మద్దతుగా ప్రజాసంఘాలు ఇస్తే అరెస్ట్‌ చేయడం దారుణమన్నారు. కార్యక్రమంలో ప్రజాసంఘాల నాయకులు పెద్ది వెంకట్రాములు, మల్యాల గోవర్ధన్‌, సబ్బని లత, కటారి రాములు, బెజుగం సుజాత పాల్గొన్నారు.  

బోధన్‌లో 

బోధన్‌ : రైతు వ్యతిరేక చట్టాలను నిరసిస్తూ బోధన్‌లో రైల్వేగేటు వద్ద గురువారం ప్రజాసంఘాల ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఢిల్లీ లో ఆందోళన చేస్తున్న రైతులపై లాఠీఛార్జీ, దాడులు చేయడాన్ని తీవ్రం గా ఖండించారు. తక్షణమే కేంద్రం ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాలను వెనక్కి తీసుకోవాలన్నారు. బీజేపీ రైతు సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించి కార్పొరేట్‌ రంగాలకు కొమ్ము కాస్తోందని మండిపడ్డారు. సీఐ భిక్షపతి ఘటన స్థలానికి చేరుకొని ప్రజాసంఘాల నాయకులను స్టేషన్‌కు తర లించారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్‌, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గంగాధర్‌, శంకర్‌గౌడ్‌, యేశాల గంగాధర్‌, లింగం, విగ్నేష్‌, కుమారస్వామి, సాయిలు పాల్గొన్నారు. 

ఢిల్లీ రైతులకు మద్దతుగా రాస్తారోకో

ఆర్మూర్‌ : వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని ఢిల్లీలో రైతులు చేస్తున్న ఆందోళనకు మద్దతుగా గురువారం ఆర్మూర్‌లో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వా నికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కెనాల్‌ బ్రిడ్జి మీద రాస్తారోకో చే యడంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. పట్టణంలో ట్రాఫిక్‌ స మస్య ఏర్పడింది. సీఐటీయూ, తెలంగాణ రైతు సంఘం, ఏఐకేఎంఎస్‌, కేవీపీఎస్‌, ఎస్‌ఎఫ్‌ఐ తదితర సంఘాల నాయకులు పల్లెపు వెంకటేష్‌, బొట్ల రాజు, ఎల్లయ్య, ఖాజామోయినొద్దీన్‌, సుధాకర్‌ పాల్గొన్నారు.

కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం

నవీపేట: మండల కేంద్రంలో గురువారం సీఐటీయూ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా సీఐ టీయూ జిల్లా ఉపాధ్యక్షుడు నాయక్వాడి శ్రీనివాస్‌ మాట్లాడుతూ ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను ఉపసంహరిం చుకోవాలన్నారు. ఢిల్లీ ఆందోళన చేస్తున్న రైతుల డిమాండ్‌లను వెంటనే పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో దేవేందర్‌సింగ్‌, మహబూబ్‌ ఖురేషి, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-04T04:37:28+05:30 IST