స్వదేశానికి రంజిత్
ABN , First Publish Date - 2020-11-26T06:00:06+05:30 IST
తాడ్వాయి మండలం నందివాడ గ్రామానికి చెందిన యువకుడు టెక్రియాల్ రంజిత్(26) దుబా యిలో రెండురోజుల క్రితం గుండెపోటుతో మృతిచెందాడు.

తాడ్వాయి, నవంబరు 25: తాడ్వాయి మండలం నందివాడ గ్రామానికి చెందిన యువకుడు టెక్రియాల్ రంజిత్(26) దుబా యిలో రెండురోజుల క్రితం గుండెపోటుతో మృతిచెందాడు. యువకుడి మృతదేహాన్ని అ క్కడ ఉన్న గల్ఫ్ కార్మికుల రక్షణ సమితి ప్ర తినిధులు బుధవారం స్వదేశానికి పంపించా రు. మృతదేహానికి ప్రతినిధులు పోస్టుమా ర్టం చేయించి కంపెనీ ప్రతినిధులతో మాట్లా డి త్వరగా పంపించేందుకు ఏర్పాట్లు చేశా రు. హైదరాబాద్‌కు మృతదేహం చేరుకోగానే తాడ్వాయి మండలం నందివాడకు చేరుకు నేందుకు వీలుగా ఉచిత అంబులెన్స్ సైతం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గల్ఫ్ కార్మికులకు అండగా ఉంటామన్నారు. కార్యక్రమంలో గల్ఫ్ కార్మికు రక్షణ సమితి అధ్యక్షుడు గుం డెల్లి నర్సింహ, ఉపా ధ్యక్షుడు శేఖర్‌గౌడ్, ప్రతినిధులు మ హేందర్, రవి, శ్రీనివాస్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.