జోరు వాన
ABN , First Publish Date - 2020-09-16T06:43:54+05:30 IST
జిల్లాలోని బాన్సువాడ, ఎల్లారెడ్డి, కామారెడ్డి డివిజన్ పరిధిల్లోనూ గత మూడు రోజులుగా వర్షా లు కురుస్తున్నాయి.

జిల్లా అంతటా వర్షం
బాన్సువాడ డివిజన్లో భారీగా కురిసిన వర్షం
పొంగిపొర్లిన వాగులు, వంకలు
నీట మునిగిన పంట పొలాలు.. పలు గ్రామాలకు రాకపోకలు బంద్
కౌలాస్ ప్రాజెక్ట్ ఆరు గేట్ల ఎత్తివేత
అలుగు పారుతున్న పోచారం ప్రాజెక్ట్
నిజాంసాగర్ ప్రాజెక్ట్‌లోకి 1200 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
కామారెడ్డి, సెప్టెంబరు 15(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని బాన్సువాడ, ఎల్లారెడ్డి, కామారెడ్డి డివిజన్ పరిధిల్లోనూ గత మూడు రోజులుగా వర్షా లు కురుస్తున్నాయి. సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు జిల్లా వ్యాప్తంగా 62.03మి.మీ వర్షపాతం నమోదయింది. అత్యధిక ంగా జుక్కల్‌లో 107.2మి.మీల వర్షం కురువగా అత్యల్పంగా కామారెడ్డి లో 12.02మి.మీల వర్షపాతం నమోదయింది. భిక్కనూర్‌లో 87.2, ఎల్లారె డ్డిలో 88.0, నిజాంసాగర్‌లో 56.6, గాంధారిలో 70.8, పిట్లంలో 45.2, మద్నూర్‌లో 82.6, లింగంపేటలో 69.8, మాచారెడ్డిలో 13.2, బీర్కూర్‌లో 47.4, బాన్సువాడలో 55.6, సదాశివనగర్‌లో 53.6, నాగిరెడ్డిపేటలో 83.04, తాడ్వాయిలో 30.08, దోమకొండలో 70.2, బిచ్కుందలో 85.04మి.మీల వర్షపాతం నమోదయింది. ఈ వర్షాకాలం సీజన్లో జిల్లా వ్యాప్తంగా 796.1 సాధారణ వర్షపాతం కాగా ఇప్పటి వరకు 922.08 వర్షా పాతం నమో దయిటనట్లు అధికారులు పేర్కొంటున్నారు.అనగా జిల్లా వ్యాప్తంగా సాధారణం కంటే ఎక్కువే వర్షాపాతం నమో దయింది. జిల్లాలో 6 మండలాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షాపాతం నమోదు కాగా 11 మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదయింది.
కౌలాస్ ప్రాజెక్ట్ గేట్ల ఎత్తివేత
జిల్లాలో నిజాంసాగర్ ప్రాజెక్ట్ తర్వాత ప్రధాన జలాశయం అయిన కౌలాస్ప్రాజెక్ట్ ఎట్టకేలకు పూర్తిగా నిండుకోవడంతో అధికారులు ఆరు గేట్లను ఎత్తివేసి దిగువకు నీటిని వదులుతున్నారు. గత 5 సంవత్సరాల తర్వాత ప్రాజెక్ట్ నిండుకోవడంతో స్థానిక ప్రజలు ఆయకట్టు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కౌలాస్‌నాల ప్రాజెక్ట్ లెవల్ 457.90 అడుగు లు కాగా ప్రస్తుతం 458అడుగుల వరకు నీరు చేరుకుంది. దీని కెపాసిటీ 1.213టీఎంసీలు కాగా ప్రస్తుతం 1.237టీఎంసీలలో నీరు ఉంది. ప్రాజెక్ట్ లోకి 20,014 క్కూసెక్కుల వరద ఇన్‌ఫ్లో అవుతుండ గా ప్రాజెక్ట్ గేట్లుఎత్తి 19,942 క్యూసెక్కుల వరదను దిగువ ప్రాంతానికి వదులుతున్నారు.
అదేవిధంగా ఎల్లారెడ్డి డివిజన్లోని నాగిరెడ్డిపేట మండలంలో గల పోచారం ప్రాజెక్ట్ సైతం నిండుకోవడంతో జల కళను సంతరించుకుంటోంది. ప్రాజెక్ట్ అలుగు పారుతుండడం ప్రధానకాలువ ద్వారా పంట పొలా లకు సాగునీటిని వదులుతున్నారు. నిజాంసాగర్ ప్రాజెక్ట్‌లోకి స్వల్పంగా వరదనీరు వచ్చి చేరుతోంది. ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షానికి, పోచారం అలుగు పారుతుండడంతో నిజాంసాగర్ ప్రాజెక్ట్‌లో కి 1,240క్యూసెక్కుల వరద ఇన్‌ఫ్లో వచ్చి చేరుతోం ది. ప్రస్తుతం 2.589 టీఎంసీల నీరు నిల్వ ఉంది. సింగీతం, కళ్యాణి రిజర్వాయర్లు సైతం నిండుకోవ డంతో జలకళను సంతరించుకుంటోంది.
నీట మునిగిన పంటలు.. పలు గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు
బాన్సువాడ డివిజన్ పరిధిలోని జుక్కల్ నియోజకవర్గంలో ఉన్న కౌలాస్‌నాల ప్రాజెక్ట్ నిండుకోవడం ఆరుగేట్లను ఎత్తి నీటిని దిగువ ప్రాం తానికి వదులుతున్నారు. దీంతో జుక్కల్, పిట్లం, బిచ్కుంద మండలాల పరిధిలోని పలు గ్రామాల్లో పంట పొలాల్లోకి వరదనీరు వచ్చి చేరడంతో నీట మునిగాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతుండడం, రహదారు లు, బ్రిడ్జీలపై వరద ఉధృతంగా ప్రవహిస్తుండడంతో ఆయా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోతున్నాయి.
బిచ్కుంద మండలంలో చిన్నదడ్గి బ్రిడ్జిపై నుంచి వరదనీరు ప్రవహించడంతో బిచ్కుంద, శాంతాపూర్‌కు రాకపోక లు నిలిచిపోయాయి. వరదనీటి వల్ల ముంపు గ్రామాలైన పెద్ద తక్కడ్ పల్లి, చిన్నతక్కడ్పల్లి, పెద్దదడ్గి, చిన్నదడ్గి, హస్గుల్, శెట్కూర్, పుల్కల్ గ్రామల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. పెద్దదేవాడ వాగు లో వరద నీరు భారీగా చేరింది. ఎడతెరపులేకుండా కురిసిన వర్షానికి సోయా పంటలన్నీ నీటమునిగిపోయాయి. పిట్లం మండలంలో కాకివా డు, పిల్లివాగులు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో ఆయా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.